చిరుకే చుక్కలు చూపెట్టిన బ్యూటీ

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 152వ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి డ్యుయెల్ రోల్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

 Chiranjeevi Stunned With Regina Dance Moves-TeluguStop.com

కాగా ఈ సినిమాలో మెగాస్టార్ ఓ సామాజిక అంశంపై పోరాటం చేస్తాడన్నది సినిమా కథగా చిత్రపురిలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే ఈ సినిమాలో చిరు సరసన అందాల భామలు త్రిష, అనుష్కలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

కాగా చిరుతో యంగ్ బ్యూటీ రెజీనా ఓ స్పెషల్ సాంగ్‌లో చిందులేస్తుందని తెలుస్తోంది.ఈ సాంగ్‌కు సంబంధించిన షూటింగ్ ఇటీవల ముగిసినట్లు తెలుస్తోంది.అయితే ఈ పాటలో రెజీనా అదిరిపోయే స్టెప్పులు వేసిందని, చిరు ఆమె డ్యాన్స్ చూసి అవాక్కయ్యాడని చిత్ర యూనిట్ అంటోంది.

Telugu Chiranjeevi, Chiru, Koratala Siva, Telugu-Movie

రెజీనా ఇంత చక్కగా డ్యాన్స్ చేస్తుందా అని చిరు నోరెళ్లబెట్టినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.ఇక ఈ పాటలో చిరుకు పోటీగా అమ్మడి డ్యాన్స్ ఉంటుందని, ఈ సినిమాతో ఆమె స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube