'భోళా శంకర్' నుండి ఫస్ట్ లుక్ టీజర్ కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

టాలీవుడ్ అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా ఎంతో ఫిట్ గా ఉంటూ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ కుర్ర హీరోలకే సవాల్ విసురుతున్నాడు.అయితే ఈయన నటించిన ఆచార్య సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి ఈయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా మిగిలి పోయింది.

 Chiranjeevi Starrer Bhola Shankar S First Look Teaser, Chiranjeevi, Megastar Chi-TeluguStop.com

దీంతో మెగా ఫ్యాన్స్ సైతం తీవ్ర నిరాశ వ్యక్తం చేసారు.

అయినా కూడా ఈయన చేస్తున్న సినిమాలపై క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

ప్రెసెంట్ చిరంజీవి తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.

అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు.

అలాగే ఈయన లైనప్ లో మరో ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు.

ఇక తాజాగా భోళా శంకర్ సినిమాపై ఒక అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ రాబోతుంది అని టాక్ బయటకు వచ్చింది.

ఆగష్టు 22న మెగాస్టార్ పుట్టిన రోజు అనే విషయం తెలిసిందే.మరి ఫస్ట్ లుక్ టీజర్ కూడా ఈ ముహుర్తానికే ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

అదే నిజం అయితే మెగా అభిమానులకు పండగ అనే చెప్పాలి.

Telugu Bhola Shankar, Bholashankars, Chiranjeevi, Teaser, God, Megas-Movie

ప్రెసెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమాలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఇందులో చిరు చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది.ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి అదిరిపోయే రెస్పాన్స్ రాగా ఇప్పుడు టీజర్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube