చిరంజీవిని చూసి యంగ్‌ హీరోలు సిగ్గు పడాలి

మెగాస్టార్‌ చిరంజీవి ఆరు పదుల వయసు దాటినా కూడా ఆయన వ్యవహరిస్తున్న తీరు, ఆయన ఉత్సాహం యంగ్‌ హీరోలకు ఆదర్శం.ఈ వయసులో కూడా వరుసగా సినిమాలు చేసేందుకు సిద్దం అవ్వడంతో పాటు ఈ కరోనా విపత్తు సమయంలో సినీ కార్మికుల కోసం తనవంతు సాయంను చేసేందుకు ముందుకు వచ్చాడు.

 Corona Virus, Lock Down, Chiranjeevi, Cinema Workers, Spanish Language, Young He-TeluguStop.com

అలాగే లాక్‌డౌన్‌తో పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యి తోట పని చేసుకుంటూ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతున్నాడు.

ఇక యంగ్‌ హీరోలు దాదాపు అందరు కూడా సోషల్‌ మీడియా అకౌంట్స్‌ను కలిగి ఉన్నారు.

కాని ఎవరు కూడా ఎక్కువగా యాక్టివ్‌గా ఉండరు.కాని చిరంజీవి మాత్రం ప్రతి రోజు ఏదో ఒక పోస్ట్‌ను పెడుతూ ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉంటున్నాడు.

చిరంజీవిని చూసి అయినా రెగ్యులర్‌గా సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టాలంటూ ఇతర హీరోల ఫ్యాన్స్‌ విజ్ఞప్తి చేస్తున్నారు.ఇక ప్రస్తుతం చిరంజీవి ఆన్‌లైన్‌ క్లాస్‌లు కూడా వింటున్నాడని తెలుస్తోంది.

తన మనవళ్లు, మనవరాళ్లు ఈ లాక్‌డౌన్‌ పీరియడ్‌లో ఆన్‌లైన్‌లో రకరకాల కోర్సులు నేర్చుకుంటున్న ఈ సమయంలో నేను కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలనే ఉద్దేశ్యంతో స్పానిష్‌ ల్యాంగ్వేజ్‌ నేర్చుకుంటున్నట్లుగా మెగాస్టార్‌ పేర్కొన్నారు.ఆన్‌లైన్‌ ద్వారా స్పానిష్‌ను నేర్చుకుంటున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.

ఈ వయసులో కూడా నేర్చుకోవాలనే పట్టుదలను ఆయన కనబర్చడం నిజంగా హ్యాట్సాఫ్‌.మెగాస్టార్‌ను చూసి ఇతర హీరోలు సిగ్గు పడాలని, టైంను వృదా చేయకుండా ఆన్‌లైన్‌లో ఏవో ఒక కోర్సును లేదంటే ఫిల్మ్‌ మేకింగ్‌లో మెలకువలను నేర్చుకోవాలంటూ పెద్ద వారు సూచిస్తున్నారు.చిరంజీవి స్పానిష్‌ నేర్చుకుంటూ ఇతర హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube