శ్రీజ భర్త కళ్యాణ్ మరో ఉదయ్ కిరణ్ అయిపోబోతున్నాడా ?

మెగాస్టార్ అల్లుడిగా టాలీవుడు లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ దేవ్ కెరీర్ ముగిసిపోయిందా అంటే అవును అనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.ఇంతకీ ఏం జరిగిందంటే మెగాస్టార్ పెద్ద కూతురు శ్రీజ శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

 Chiranjeevi Son In Law Kalyan Struggles Wife Srija Details, Sreeja, Kalyan Dev,-TeluguStop.com

ఇక ఆ తర్వాత ఏమైందో తెలియదు మొదటి భర్తకు విడాకులు ఇచ్చేసారూ.ఇక ఇలా విడాకుల తర్వాత చిరంజీవి తన కూతురుకి రెండో పెళ్లి చేసాడు.

ఈ క్రమంలో కళ్యాణ్ దేవ్ శ్రీజ నూ రెండో పెళ్లి చేసుకోవడం గమనార్హం.ఈ పెళ్లి జరిగిందో లేదో ఏకంగా మెగాస్టార్ అల్లుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు కళ్యాణ్ దేవ్.

విజేత సినిమాతో టాలీవుడ్ లో హీరోగా పరిచయం అయ్యాడు.

మెగా స్టార్ అల్లుడు అంటూ భారీ అంచనాలతో వచ్చిన విజేత సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు.

ఇటీవలే సూపర్ మచ్చి అనే సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చాడు.కాని ఈ సినిమా వచ్చినట్లే తెలియదు ఎవ్వరికి.అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది ఈ సినిమా.అయితే అల్లుడు కళ్యాణ్ దేవ్ సినిమాకు అసలు మెగా హీరోల నుండి ఎక్కడ సపోర్ట్ లేకపోవటం గమనార్హం.

కళ్యాణ్ దేవ్ నూ దూరం పెడుతున్నారన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో రూపొందుతుంది.దీనికి కారణం కూడా లేకపోలేదు.

శ్రీజ, కళ్యాణ్ దేవ్ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారట.ఈ ఇద్దరికీ అస్సలు పోసగటం లేదట.

Telugu Kalyan Dev, Chiranjeevi, Sreeja, Sreeja Kalyan, Srijakalyan, Macchi, Uday

దీంతో త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు అంటూ టాక్ గట్టిగా వినిపిస్తుంది.అయితే ఇప్పటికే శ్రీజ తన పేరు పక్కన కళ్యాణ్ అనే పేరు తొలగించి విడాకుల విషయాన్నీ చెప్పకనే చెప్పింది.త్వరలో విడాకులు తప్పవు అంటూ టాక్ తెగ చక్కర్లు కొడుతుంది.అయితే మెగా అల్లుడు అనే ట్యాగ్ ఉండటం వల్లే కళ్యాణ్ దేవ్ తో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు.

అదే ట్యాగ్ లేకపోతే మాత్రం కళ్యాణ్ దేవ్ తో సినిమాలకు ఎవరు ముందుకు వచ్చే అవకాశం లేదు.చేసిన సినిమాలు సక్సెస్ కావటం లేదు.దీంతో కళ్యాన్ దేవ్ కెరియర్ ముగిసినట్లే అంటూ ప్రచారం ఊపందుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube