'మా' ఎన్నికలపై చిరంజీవి సీరియస్.. సంచలన వ్యాఖ్యలు

Chiranjeevi Serious On Maa Elections

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు గతంతో పోల్చితే ఈ సారి చాలా రసవత్తరంగా సాగుతున్నాయి.ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ పెరిగిపోతున్నది.

 Chiranjeevi Serious On Maa Elections-TeluguStop.com

ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.మీడియా ఎదుట విమర్శించుకుంటున్నారు.

ఈ నెల 10న ‘మా’ ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలో ప్యానెల్స్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం పట్ల తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారని తెలుస్తోంది.‘మా’ సభ్యులపై సీరియస్ అయినట్లు సమాచారం.ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి తన సపోర్ట్ ఎవరికి ఇస్తారనేది తానుగా అధికారికంగా చెప్పలేదు.

 Chiranjeevi Serious On Maa Elections-మా’ ఎన్నికలపై చిరంజీవి సీరియస్.. సంచలన వ్యాఖ్యలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ, మెగా బ్రదర్ నాగబాబు ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు మద్దతు తెలపడం ద్వారా మెగాస్టార్ సపోర్ట్ కూడా ప్రకాశ్ రాజ్‌కు ఉందని అనుకుంటున్నారు.ఇకపోతే మంచు విష్ణు రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ, బాలయ్య సపోర్ట్ తీసుకుంటున్నారు.

కాగా, ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం చేసి రెండు వార్గాలపైన చిరు కాస్త సీరియస్ అయ్యారట.అందరూ మనవాళ్లే.

అయినప్పుడు ఇలా నోరుజారి మాట్లాడాల్సిన అవసరం లేదని, ఇలా విమర్శలు చేసుకోవడం వల్ల మన పరువే పోతుందని వారికి చెప్పినట్లు టాక్ వినబడుతోంది.ఈ ఎన్నికలపైన ఏం మాట్లాడకుండా ఓటింగ్ రోజున వెళ్లి తన ఓటు కామ్‌గా వేసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి ఫిక్స్ అయినట్లు సమాచారం.

Telugu Balakrishna, Chiranjeevi, Chiranjeevi Maa, Maa, Manchu Vishnu, Chiranjeevi, Artist, Nagababu, Prakash Raj, Tollywood-Movie

ఇకపోతే మా ఎన్నికల్లో గెలిచేది తామేనని ప్రకాశ్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ ధీమా వ్యక్తం చేస్తున్నాయి.ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది ప్యానెల్ సభ్యులు ప్రచారం ఇంకా ముమ్మరం చేస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు, మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు మా సభ్యులను కలిసే ప్రయత్నం చేస్తున్నారు.ఫోన్ ద్వారా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కలిసి తమ ప్యానెల్‌కు ఓటు వేయాలని కోరుతున్నారు.మొత్తంగా ‘మా’ ఎన్నికలు ఒకరకంగా జనరల్ ఎలక్షన్స్‌ను తలపిస్తున్నాయని కొందరు సినీ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.’

#MAA #Chiranjeevi Maa #Artist #Manchu Vishnu #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube