మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) వయస్సు 69 సంవత్సరాలు అనే అంగతి తెలిసిందే.ఈ వయస్సులో కూడా చిరంజీవి తన ఎనర్జీ లెవెల్స్ తో ఆశ్చర్యపరుస్తున్నారు.
తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొన్న చిరంజీవి నా జీవితంలో ఫ్యామిలీ స్టార్ మా నాన్నేనని చెప్పారు.కుటుంబ విలువలు కాపాడాలని ఒక వ్యక్తి నిర్ణయం తీసుకుంటే ఆ కుటుంబానికి ఢోకా ఉండదని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.
అందువల్లే పండుగ సమయంలో ఫ్యామిలీ అంతా కలుస్తామని చిరంజీవి తెలిపారు.
నా లైఫ్ లో ఎన్నో కష్టాలు, ఎత్తుపల్లాలు చూశానని ఆయన కామెంట్లు చేశారు.
నేను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని చిరంజీవి చెప్పుకొచ్చారు.ఒక నిర్మాత సూపర్ స్టార్లు అయిపోయారని అనుకుంటున్నారా అంటూ కామెంట్లు చేశారని చిరంజీవి అన్నారు.
ఒక నిర్మాత( Producer ) చాలా అవమానకరంగా దుర్భాషలాడుతూ కామెంట్లు చేశారని ఆయన తెలిపారు.ఆ సమయంలో నా గుండె పిండేసినట్లు అనిపించిందని మెగాస్టార్ తెలిపారు.

ఆ సమయంలోనే నేను సూపర్ స్టార్ కావాలని ఫిక్స్ అయ్యానని ఆ అవమనాలను నా ఎదుగుదల కోసం వాడుకుని ఎదిగనని మెగాస్టార్ చెప్పుకొచ్చారు.చిరంజీవి వెల్లడించిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.చిరంజీవి రెమ్యునరేషన్( Chiranjeevi Remuneration ) సైతం భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.చిరంజీవి సక్సెస్ స్టోరీ వెనుక ఉన్న ట్విస్టులు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

ప్రస్తుతం విశ్వంభర సినిమాలో( Viswambhara ) నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో మరో భారీ హిట్ ను సొంతం చేసుకోవడం ఖాయమని తేలిపోయింది.విశ్వంభర సినిమాలో విజువల్ ఎఫెక్స్ట్స్ కు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఉందనే సంగతి తెలిసిందే.చిరంజీవి భారీ ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ ను రాబోయే రోజుల్లో కూడా షేక్ చేస్తాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.చిరంజీవి వివాదాలకు దూరంగా ముందుకు సాగుతున్నారు.