సిరివెన్నెల కోసం చిరంజీవి 2 రోజుల పాటు ఎందుకు వెతికాడు

Chiranjeevi Search For Sirivennela

తెలుగు సినిమా పరిశ్రమలో సినీ రచయితగా వెలుగొందిన సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం టాలీవుడ్ లో విషాదాన్ని నింపింది.తెలుగు సినిమా దర్శకులు, నిర్మాతలు, హీరోలతో మంచి సంబంధాలు కొనసాగించిన ఆయన.

 Chiranjeevi Search For Sirivennela-TeluguStop.com

సడెన్ గా చనిపోవడం పట్ల అందరూ షాక్ కు గురవుతున్నారు.అయితే సిరివెన్నెల ఒకానొక సమయంలో పలు చక్కటి అనుభూతులను గుర్తు చేసుకున్నాడు.

ఇంతకీ ఆయన ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 Chiranjeevi Search For Sirivennela-సిరివెన్నెల కోసం చిరంజీవి 2 రోజుల పాటు ఎందుకు వెతికాడు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టాలీవుడ్ టాప్ హీరోమెగాస్టార్ చిరంజీవి.

తనకొసం రెండు రోజులు వెతికాడని సిరివెన్నెల సీతారామశాస్త్రి వెల్లడించాడు.తన సినీ కెరీర్ లో రాసిన రెండో పాట తన సినిమాలోనిదన్నాడు.

కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన వేట సినిమాకు ఈ పాట రాశానని చెప్పాడు.ఈ సినిమాలో పాటల గురించి మాట్లాడేందుకు దర్శకుడు తనను మద్రాసుకు పిలిచినట్లు చెప్పాడు.

Telugu Chiranjeevi, Krishnamvanda, Sirivennela, Tollywood, Veta-Latest News - Telugu

ఆయన చెప్పిన దాని ప్రకారం ఒక పాటను 20 రకాలుగా రాసినట్లు చెప్పాడు.అప్పుడు పాటలు బాగా రాస్తున్నానని సంగీత దర్శకుడు చక్రవర్తి ట్యూన్ రాస్తావా అంటూ ఓ స్వరం ఇచ్చినట్లు చెప్పాడు.అప్పుడు తాను రాసిన పాటే ఓ లేడి ట్యూనూ అని చెప్పాడు.ఖైదీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి.నేను రాసిన పాటలు విని చాలా గొప్పగా ఫీలయ్యాడని చెప్పాడు.నన్ను అభినందించేందుకు ఏకంగా నా కోసం రెండు రోజుల పాటు వెతికాడని చెప్పాడు.

అంత గొప్ప మనిషి చిరంజీవి అని చెప్పాడు సిరివెన్నెల.

Telugu Chiranjeevi, Krishnamvanda, Sirivennela, Tollywood, Veta-Latest News - Telugu

అటు స్వర్ణ కమలం సినిమాలోని శివపూజకు అనే పాటను రాయడానికి తనకు 15 రోజుల సమయం పట్టినట్లు వెల్లడించాడు.అటు చక్రం సినిమాలోని జగమంత కుటుంబంనాది అనే పాటను 1970లోనే తాను రాసినట్లు చెప్పాడు.ఈ పాట విని సినిమాలో పెట్టాలని దర్శకుడు కృష్ణవంశీ చెప్పాడట.

ఆఖరికి చక్రం సినిమాలో ఈ పాటను పెట్టినట్లు వెల్లడించాడు.అటు రానా హీరోగా చేసిన కృష్ణం వందే జగద్గురుంలో సిరివెన్నెల దశవతార రూపాకాన్ని రాశాడు.

తొమ్మిదిన్నర నిమిషాల పాటు సాగే ఈ పాట రాయడానికి చాలా సమయం పట్టినట్లు చెప్పాడు.

#Sirivennela #Kodanda Rame #Chiranjeevi #Veta #KrishnamVanda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube