అక్కడ చిరంజీవి సినిమా మళ్ళీ రిలీజ్ అయ్యింది… ఫ్యాన్స్ సందడి మొదలైంది  

Chiranjeevi Sarja\'s \'Shivarjuna\' to be re-released in theaters, Sandalwood, Arjun Sarja, Kannada Cinema, Bangalore, Lockdown, - Telugu Arjun Sarja, Bangalore, Chiranjeevi Sarja, Kannada Cinema, Lockdown, Sandalwood, Shivarjuna

కరోనా లాక్ డౌన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం తాజాగా థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది.అయితే 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడిపించాలని ఆదేశాలు జారీ చేసింది.

TeluguStop.com - Chiranjeevi Sarjas Shivarjuna To Be Re Released In Theaters

అలాగే కొన్ని నిబంధనలు కూడా పెట్టింది.అయితే ఈ ప్రభుత్వం నిబంధనలకి లోబడి కొన్ని రాష్ట్రాలలో థియేటర్లు మరల ఓపెన్ చేశారు.

అయితే తెలుగు రాష్ట్రాలలో థియేటర్ యజమానులు ఇంకా వేచి చూస్తున్నారు.ఇప్పట్లో సినిమా రిలీజ్ లు కూడా లేకపోవడంతో ఓపెన్ చేసిన ప్రయోజనం ఉండదని కొంత కాలం వేచి చూస్తే మరిన్ని సడలింపులు వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు.

TeluguStop.com - అక్కడ చిరంజీవి సినిమా మళ్ళీ రిలీజ్ అయ్యింది… ఫ్యాన్స్ సందడి మొదలైంది-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే కర్ణాటక ప్రభుత్వం మాత్రం థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది.అక్కడి థియేటర్ ఓనర్స్ కూడా రెడీ అయిపోయారు.

ఈ నేపధ్యంలో థియేటర్ లో ఓపెన్ చేసిన తర్వాత మొదటి సినిమాగా దివంగత హీరో చిరంజీవి సర్జా సినిమాని రీ రిలీజ్ చేశారు.

లాక్ డౌన్ కి ముందు చిరంజీవి సినిమా శివార్జున రిలీజ్ అయ్యింది.

సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిన కూడా కరోనా భయంతో జనం థియేటర్స్ కి వెళ్ళలేదు.దీంతో అనుకున్న స్థాయిలో కలెక్షన్ రాలేదు.ఈ నేపధ్యంలో బెంగళూరులో థియేటర్స్, మల్టీప్లెక్సులు అన్నీ కోవిడ్ నిబంధనలకు లోబడి ఓపెన్ చేశారు.అందులో భాగంగానే శివార్జున సినిమాను మరోసారి విడుదల చేసారు.

ఈ సారి మాత్రం చిరును చివరిసారి సిల్వర్ స్క్రీన్‌పై చూడ్డానికి అభిమానులు పోటీ పడ్డారు.సగం టికెట్స్ అమ్మిన హౌజ్ ఫుల్ బోర్డులు కనిపించాయి థియేటర్స్ ముందు ఈ దివంగత హీరోకు కటౌట్స్ కట్టి పాలాభిషేకాలు చేశారు.

ఇదిలా ఉంటే అక్టోబర్ 17న ఈయన జయంతి కారణంగా చిరంజీవి సర్జా చివరగా నటించిన సినిమాల ట్రైలర్స్, టీజర్స్ విడుదలయ్యాయి.

#Arjun Sarja #Sandalwood #Bangalore #Lockdown #Shivarjuna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chiranjeevi Sarjas Shivarjuna To Be Re Released In Theaters Related Telugu News,Photos/Pics,Images..