జగన్ పై పవన్ కు చెప్పిన 'చిరు' సలహా ఏంటి ?

అధికారంలో లేకపోయినా, ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా కేవలం ఒక్క సీటుకే పరిమితం అయినా జనసేన పార్టీ అధికార పార్టీని ప్రశ్నించడంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.ఎన్నికల ఫలితల తరువాత జనసేన పార్టీ దుకాణం సర్దుకుంటుందని, పవన్ ఇక సినిమాల్లో బిజీ బిజీ అయిపోతాడని అంతా భావించగా దానికి భిన్నంగా గతం కంటే ఎక్కువ స్థాయిలో పవన్ గొంతెత్తుతున్నాడు.

 Chiranjeevi Said The Pawan Kalyan About Ap Cm Jagan Mohan Reddy-TeluguStop.com

ముఖ్యంగా ప్రజా సమస్యల విషయంలో పవన్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముందుకు దూసుకుపోతున్నాడు.ఇక జనసేన పార్టీ, ఆ పార్టీ అభిమానులు సోషల్ మీడియా లో వరుసగా రెచ్చిపోయి మరీ వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు.

జనసేన పార్టీకి చెందిన శతఘ్ని టీమ్ వైఎస్ జగన్ ఫెయిల్డ్ సీఎం అనే క్యాంపైయిన్‌నే సోషల్ మీడియాలో నడిపింది.దీంతో అప్పట్లో ఆ పార్టీకి చెందిన ట్విట్టర్ ఖాతాలు మూతపడ్డాయి.

Telugu Apcm, Chiranjeevi, Chiru Jagan, Pawankalyan-

  జనసేన దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో పాటు సదరు సంస్థలను దీనిపై ప్రశ్నించడంతో ఆ ఖాతాలు మళ్లీ యాక్టివ్ అయ్యాయి.ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ, జనసేన పార్టీల మధ్య ఉప్పు నిప్పు అనేలా వ్యవహారం నడుస్తూ వస్తోంది.ఇదిలా ఉంటే ఇటీవల ఏపీ సీఎం జగన్‌ను మెగాస్టార్ చిరంజీవి కలవడం, అనేక విషయాల గురించి చర్చలు జరపడం జరిగాయి.అయితే ఆ వివరాలు ఏంటి అనేది ఎక్కడా బయటకి రాకపోయినా చిరు – జగన్ మధ్య చర్చలు జరిగిన నాటి నుంచి పవన్ లో ఏదో తెలియని మార్పు వచ్చినట్లుగా అందరిలోనూ అనుమానాలు రేకెత్తుతున్నాయి.

జగన్ విషయంలో పవన్‌కు చిరంజీవి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Telugu Apcm, Chiranjeevi, Chiru Jagan, Pawankalyan-

  జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా రాజకీయ అరంగ్రేటం చేసినప్పటికీ జగన్ తన రెక్కల కష్టం మీద వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చాడని, సమర్ధవంతమైన రాజకీయ నాయకుడిగా అనతికాలంలోనే గుర్తింపు సంపాదించుకున్నాడని అందరికి తొందరగానే అర్ధం అయ్యింది.రాజశేఖర రెడ్డి కంటే జగన్ మొండివాడు అనే విషయాన్ని చంద్రబాబు సైతం అర్ధం చేసుకున్నాడు.ఇక ప్రస్తుతం జగన్‌ పరిపాలనపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా ప్రజల్లో మాత్రం అంత వ్యతిరేకత లేదు.

ఇవన్నీ అంచనా వేసిన చిరంజీవి తన తమ్ముడు పవన్ ను జగన్ మీద విమర్శలు చేసే విషయంలో దూకుడు ప్రదర్శించవద్దని, సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది.అందుకే జగన్ ఇప్పుడు ఏపీ విషయాల మీద కంటే తెలంగాణ రాజకీయల మీద ఎక్కవ ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube