చిరు సరసన మిల్కీ బ్యూటీ..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరక్షన్ లో వేదాళం రీమేక్ గా భోళా శంకర్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో చిరు సరసన ఫీమేల్ లీడ్ గా మిల్కీ బ్యూటీ తమన్నాని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

 Chiranjeevi Romance With Milky Beauty Tamannah-TeluguStop.com

సినిమాలో చిరంజీవికి సిస్టర్ రోల్ లో మహానటి కీర్తి సురేష్ ఫిక్స్ అవగా ఇక ఇప్పుడు చిరు తో రొమాన్స్ చేసేందుకు తమన్నా సై అన్నట్టు టాక్.సీనియర్ హీరోలకు హీరోయిన్స్ విషయంలో ఇబ్బందులు తప్పట్లేదు.

అయితే కాజల్, తమన్నా లాంటి వారు మాత్రం సీనియర్ హీరోలతో కూడా సై అనేస్తున్నారు.

 Chiranjeevi Romance With Milky Beauty Tamannah-చిరు సరసన మిల్కీ బ్యూటీ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చిరుతో తమన్నా ఆల్రెడీ సైరా సినిమాలో నటించింది.

ఇక ఇప్ప్డుడు మరోసారి భోళా శంకర్ కోసం చిరు సరసన నటిస్తుందని టాక్.ఇప్పటికే వెంకటేష్ F 2లో నటించి మెప్పించిన తమన్నా మరోసారి ఆ సినిమా సీక్వల్ గా వస్తున్న F 3లో కూడా నటిస్తుంది.

చిరంజీవి, వెంకటేష్ ఇలా సీనియర్ హీరోలకు కూడా తమన్నా ఓకే చెబుతుంది. ఇదే ఫాం కొనసాగిస్తే తమన్నా మరో ఐదేళ్లు కెరియర్ కొనసాగించే అవకాశం ఉంది.

 సీనియర్ హీరోలతోనే కాదు యువ హీరోలతో కూడా తమన్నా వరుస సినిమాలు చేస్తూ జోరు కొనసాగిస్తుంది.

#Tamannah #Bhola Shankar #Chiranjeevi #Meher Ramesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు