గాడ్ ఫాదర్ లో సల్మాన్ ను కోరి మరీ అందుకే ఎంపిక చేశారట!

టాలీవుడ్ లో దసరా సందడి మొదలయ్యింది.ఈ ఏడాది టాలీవుడ్ నుండి దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాల్లో మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ కూడా ఉంది.

 Chiranjeevi Reveals Why He Chose Salman Khan, Megastar Chiranjeevi, God Father,-TeluguStop.com

తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక రీమేక్ సినిమా.మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

విడుదల తేదీ దగ్గర అవుతున్న ప్రొమోషన్స్ కూడా స్పీడ్ పెంచేశారు.ఇటీవలే గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు.

 Chiranjeevi Reveals Why He Chose Salman Khan, Megastar Chiranjeevi, God Father,-TeluguStop.com

ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.ఇక నిన్న హిందీ ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు.ఈ ట్రైలర్ లాంచ్ నిన్న గ్రాండ్ గా ముంబై లో జరిగింది.ఇక ఈ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్, చిరంజీవి కొన్ని ఆసక్తికర విషయాలు మాట్లాడారు.

హిందీ సినిమాలు మీ దగ్గర సరిగ్గా రాణించడం లేదు.కానీ తెలుగు సినిమాలు మాత్రం హిందీలో బాగా ఆడుతున్నాయి.అంటూ సల్మాన్ నవ్వుతు అన్నారు.మరి దీనికి మెగాస్టార్ ఈ సమస్యను పరిష్కరించేందుకే.

సల్మాన్ ఖాన్ ను తమ సినిమాలో తీసుకున్నామని రెండు ఇండస్ట్రీలలో రెండు బాషల సినిమాలకు మంచి ఆదరణ ఉండాలనే కారణం తోనే సల్మాన్ ఖాన్ ను తీసుకున్నామని మెగాస్టార్ సీక్రెట్ రివీల్ చేసారు.మరి ఈ సినిమా హిందీలో ఎలా ఆడుతుందో చూడాలి.

ఇక ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార మెగాస్టార్ కు చెల్లెలి పాత్రలో.సత్యదేవ్ భార్య పాత్రలో కీలక మైన పాత్రలో నటించింది.అలాగే ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు, కొణిదెల ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తుండగా.థమన్ సంగీతం అందిస్తున్నాడు.మరి ఈ సినిమాపై ఆచార్య ఎఫెక్ట్ పడకుండా సూపర్ హిట్ అవుతుందో లేదో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube