సీఎం జగన్ కు చిరు విజ్ఞప్తి మధ్యలోకి మంచు విష్ణుని లాగి రచ్చ రచ్చ?

తెలుగు సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన షాక్ తో కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్లు అయిపోయింది.ఆన్ లైన్ టికెటింగ్ టికెట్ల ధరలు, బెనిఫిట్స్ షోలంటూ ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ మీద స్థానం ఉపయోగించింది.

 Chiranjeevi Request To Jagan On Ticket Prices Netizens Questioning Manchu Vishnu-TeluguStop.com

దీంతో బడా నిర్మాతలు, పెద్ద పెద్ద సినిమాలు చిక్కులలో పడ్డట్లు అయ్యింది.ఇప్పటికే భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంతో ఏం చేయాలో ఎవరికీ పాలుపోవడం లేదు.

ఇటీవలే సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయి అందరికి తెలిసిందే.

ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పోరాడాలి కానీ విజ్ఞప్తులు రిక్వెస్ట్ చేస్తే కుదరదు అని పవన్ కళ్యాణ్ అన్న విషయం తెలిసిందే.ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో సినీ ఇండస్ట్రీకి సంబంధం లేదని కూడా అన్నారు.

నిర్ణయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ తొక్కేసేందుకు తీసుకున్నారని ఒకవైపు వాదన వినిపిస్తున్నాయి.ఈ విషయాలపై తాజాగా చిరు తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

‘పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్ లైన్ టికెటింగ్ బిల్ ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయం.

అదే విధంగా థియేటర్ల మనుగడ కోసం, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకుదెరువు కోసం, తగ్గించిన టికెట్ రేట్స్‌ని కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని స్టేట్స్‌లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది.దేశమంతా ఒకేటే జీఎస్టీగా టాక్స్‌లు ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు టికెట్ ధరల్లో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం.దయచేసి ఈ విషయమై పునరాలోచించండి.

ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుంది’ అంటూ మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేశారు.ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్ గా మారడంతో కొంతమంది నెటిజన్లు స్పందిస్తూ.

ఇండస్ట్రీలో ఏవైనా సమస్యలు తలెత్తే ముందుగా మా అధ్యక్షుడు ముందుండి నడిపించాలి.

కానీ ఈ విషయంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు ఎక్కడికి వెళ్లారు అంటూ మధ్యలో అతనిని లాగారు.ఈ క్రమంలోనే ఈ విషయంలోకి మంచు విష్ణును లాగి సోషల్ మీడియా వేదికగా మరోసారి రచ్చ చేస్తున్నారు.దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

కొందరు నెటిజన్లు మంచు విష్ణును ఏకిపారేస్తున్నారు.మా అధ్యక్షుడు  మంచు విష్ణు ఎక్కడ ఉన్నాడు.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube