ప్లాస్మా దానం చేయండంటున్న చిరంజీవి..!

కరోనా నుండి కోలుకున్న వారు మరికొందరి ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు మెగాస్టార్ చిరంజీవి.కరోనాతో పోరాడి జయించిన వారు ప్లాస్మా దానం చేయాలని సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.

 Chiranjeevi Request Plasma Donation For Corona Patients-TeluguStop.com

సెకండ్ వేవ్ కరోనా ప్రభావం బాగా ఉందని చిరు ఆవేదన వ్యక్తం చేశారు.ప్లాస్మా కొరత వల్ల కొందరు ప్రాణాల కోసం పోరాడుతున్నారని వారిని ఆదుకోవడానికి కరోనా నుండి కోలుకున్న వారు ముందుకు రావాలని అన్నారు.

కరోనా నుండి రికవరీ అయిన వారు ప్లాస్మా దానం చేయాలని కోరుతున్నారు చిరంజీవి.

 Chiranjeevi Request Plasma Donation For Corona Patients-ప్లాస్మా దానం చేయండంటున్న చిరంజీవి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనా నుండి కొద్దిరోజుల ముందు రికవరీ అయిన ఎవరైనా ప్లాస్మా దానం చేయొచ్చు.

వాళ్లు ఇచ్చే ప్లాస్మా మరికొందరి ప్రాణాలను కాపాడుతుందని చెబుతున్నారు చిరంజీవి.అభిమానులు కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు చిరు.

ప్లాస్మా డొనేషన్ సూచనలకు చిరంజీవి ఛారిటబుల్ ఫౌండేషన్ ఆఫీస్ నంబర్లు 040 23554849, 944005577 ను సంప్రదించలని కోరారు చిరు.కరోనా టైం లో పరిశ్రమ పెద్దగా సీసీసీ ని ఏర్పాటు చేసి సినీ కార్మీకులకు అండగా ఉన్నారు చిరంజీవి.

కరోనా సెకండ్ వేవ్ తీవ్రత సినీ పరిశ్రమ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది.ఇప్పటికే ఎక్కడికక్కడ షూటింగ్స్ కూడా ఆపేశారు.

పరిస్థితి మళ్లీ కంట్రోల్ లోకి వచ్చే వరకు అన్ని షూటింగ్స్ కు బ్రేక్ పడినట్టే.

#Plasma #Corona #Donation #Request #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు