ఆ మూడు సినిమాలకు చిరంజీవి రూపాయి కూడా తీసుకోవడం లేదట.. కారణం ఏమిటంటే?

మెగాస్టార్ చిరంజీవికి రీఎంట్రీలో కూడా ప్రేక్షకుల్లో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు.తమిళంలో హిట్టైన కత్తి సినిమా రీమేక్ అయిన ఖైదీ నంబర్ 150 తెలుగులో ఘనవిజయాన్ని సొంతం చేసుకోగా సైరా నరసింహారెడ్డి సైతం తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.

 Chiranjeevi Remuneration For Future Projects Details, Chiranjeevi, Megastar Chir-TeluguStop.com

అయితే చిరంజీవి నటించిన ఆచార్య సినిమా మాత్రం ప్రేక్షకులను అస్సలు ఆకట్టుకోలేదనే చెప్పాలి.

చిరంజీవికి సూట్ కాని బ్యాక్ డ్రాప్ ను ఎంచుకోవడం వల్లే ఈ సినిమా విషయంలో పొరపాటు జరిగిందని ఎక్కువ సంవత్సరాల పాటు షూటింగ్ చేయడం కూడా ఈ సినిమాకు మైనస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చిరంజీవి తన సినీ కెరీర్ లో ఎక్కువ సంఖ్యలో బ్లాక్ బస్టర్ హిట్లను సాధించగా తక్కువ సంఖ్యలో డిజాస్టర్లు ఉన్నాయి.ఆచార్య సినిమాతో కొరటాల శివ ఖాతాలో కూడా తొలి డిజాస్టర్ చేరింది.

అయితే ప్రస్తుతం నటిస్తున్న మూడు సినిమాలకు చిరంజీవి రూపాయి కూడా రెమ్యునరేషన్ గా తీసుకోవడం లేదని సమాచారం అందుతోంది.

Telugu Acharya, Bhola Shankar, Chiranjeevi, Projects, God, Koratala Siva-Movie

సినిమా బడ్జెట్, బిజినెస్, నిర్మాతలకు వచ్చే లాభాలను బట్టి రెమ్యునరేషన్ తీసుకోవాలని చిరంజీవి ఫిక్స్ అయ్యారని బోగట్టా.ఆచార్య సినిమా విషయంలో కూడా మెగాస్టార్ రెమ్యునరేషన్ విషయంలో ఇదే సూత్రాన్ని ఫాలో అయ్యారనే సంగతి తెలిసిందే.

Telugu Acharya, Bhola Shankar, Chiranjeevi, Projects, God, Koratala Siva-Movie

నిర్మాతల కోసం చిరంజీవి తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.చిరంజీవి గాడ్ ఫాదర్ షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేయగా భోళా శంకర్, వాల్తేరు శీనయ్య సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.ఈ సినిమాలలో గాడ్ ఫాదర్ మొదట రిలీజ్ కానుండగా మిగతా రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.

ఈ మూడు సినిమాలతో చిరంజీవి వరుస విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.చిరంజీవి భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై సైతం భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube