మీడియా నన్ను బద్నామ్ చేసింది.. ఆ ఛానెళ్లకు చురకలంటించిన చిరంజీవి!

Chiranjeevi Reminds Bitter Experience He Had Due To Media

సినిమాలలో సక్సెస్ సాధించిన వాళ్లు రాజకీయాలలో కూడా సక్సెస్ అవుతారా? అనే ప్రశ్నకు కొంతమంది హీరోలు సక్సెస్ అవుతామని ప్రూవ్ చేస్తే మరి కొందరు హీరోలు మాత్రం రాజకీయాలలో సక్సెస్ సాధించలేకపోయారు.చాలా సంవత్సరాల క్రితం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ పార్టీ ద్వారా రాజకీయాలలో సక్సెస్ సాధించాలని అనుకున్నారు.

 Chiranjeevi Reminds Bitter Experience He Had Due To Media-TeluguStop.com

అయితే చిరంజీవి ఆశించిన స్థాయిలో ప్రజారాజ్యం పార్టీకి సీట్లు రాలేదు.

తాజాగా ఒక కార్యక్రమానికి హాజరైన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సమయంలో ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.

 Chiranjeevi Reminds Bitter Experience He Had Due To Media-మీడియా నన్ను బద్నామ్ చేసింది.. ఆ ఛానెళ్లకు చురకలంటించిన చిరంజీవి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తనపై కొన్ని మీడియా ఛానెళ్లు దుష్ప్రచారం చేశాయని చిరంజీవి తెలిపారు.ఆ సమయంలో ప్రజా అంకిత యాత్రలో భాగంగా తాను ప్రజలతో మమేకమయ్యానని చిరంజీవి అన్నారు.

చాలామంది ఫ్యాన్స్ కు షేక్ హ్యాండ్స్ ఇవ్వడంతో పాటు ఆలింగనం చేసుకున్నానని చిరంజీవి తెలిపారు.

ఒక స్టేషన్ లో స్పీచ్ పూర్తైన తర్వాత మరో స్టేషన్ కు బస్సులో వెళుతుండగా నాలుగు మీడియా ఛానెళ్లు నన్ను నిరంతరం ఫాలో అయ్యాయని చిరంజీవి చెప్పుకొచ్చారు.

మీడియా ఛానెళ్లు తాను చేసే పొరపాటు కోసం ఫాలో అయ్యేవని మెగాస్టార్ చెప్పుకొచ్చారు.బస్ లో డ్రైవర్ పక్క సీట్ లో కూర్చున్న సమయంలో మా బాయ్ తినడానికి ఖర్జూరాలు ఇచ్చాడని వాటిని తినాలని తాను శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకున్నానని చిరంజీవి అన్నారు.

Telugu Chiranjeevi, Prajarajyam, Sanitizer-Movie

ఆ వీడియోను ఎడిటింగ్ చేసి తాను చేతులు శుభ్రం చేసుకునే వీడియోను పదేపదే చూపించి చిరంజీవికి ప్రజల్ని తాకడమంటే అసహ్యమని ఫ్యాన్స్ అంటరాని వాళ్లు అయ్యారా? అంటూ ప్రచారం చేశారని చిరంజీవి పేర్కొన్నారు.మీడియా నన్ను బద్నామ్ చేసిందని తన గురించి తప్పుగా ప్రచారం చేసిన ఛానెళ్లకు మెగాస్టార్ చిరంజీవి చురకలంటించారు.

#Prajarajyam #Chiranjeevi #Sanitizer

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube