తెలుగమ్మాయిని రిజెక్ట్ చేసిన చిరంజీవి?

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఇప్పుడు అంతటా ఇదే చర్చ.అనుష్క, నయనతార కాదనే సరికి మెగాస్టార్ కి ఓ జోడి వెతికిపట్టడం కోసం తెగ కష్టపడుతోంది చిత్ర యూనిట్.

 Chiranjeevi Rejected Sobhita Dhulipala?-TeluguStop.com

ఆఖరికి బాలివుడ్ భామ నర్గిస్ ఫక్రీని కూడా సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి.

కాని బాలివుడ్ హీరోయిన్ వద్దని చిరంజీవే చెప్పారట.

దాంతో ఓ తెలుగమ్మాయి పేరు సజెస్ట్ చేసారట దర్శకుడు వివి వినాయక్.ఆమె పేరు శోభిత ధులిపాళ.

పేరు ఎక్కడో విన్నట్టు ఉందా? ఈ తెనాలి అమ్మాయి మాజి మిస్ ఇండియా.మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ కూడా గెలుచుకుంది.

వయసు ఇంకా 24 సంవత్సరాలే.ఈమధ్యే రామన్ రాఘవ్ 2.0 అనే సినిమాతో బాలివుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఎందుకో తెలియదు కాని, ఈ తెలుగమ్మాయిపై ఇంటరెస్టు చూపించలేదట చిరంజీవి.

దాంతో కాజల్ వైపు అడుగులేసారు యూనిట్ సభ్యులు.విచిత్రంగా కాజల్ 2.50 కోట్లు అడుగుతోంది.ఈరకంగా చిరంజీవి 150వ సినిమాకి హీరోయిన్ ఎవరు ఓ పట్టాన సెట్ కావట్లేదు.

ఇంకా ఎవరెవరిని అడుగుతారో, ఎవరెవరిని రిజెక్ట్ చేస్తారో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube