రాజ్యసభ సీటును తిరష్కరించిన చిరంజీవి

ఈమద్య కాలంలో ఏపీ సీఎం జగన్‌కు చిరంజీవి సన్నిహితంగా ఉంటున్న విషయం తెల్సిందే.ఒకానొక సమయంలో వైకాపాలో చిరంజీవి జాయిన్‌ కాబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది.

 Chiranjeevi Reject The Rajya Sabha Seat-TeluguStop.com

సీఎం జగన్‌ మూడు రాజధానుల నిర్ణయాన్ని మొదటగా సమర్ధించింది చిరంజీవి అనే విషయం తెల్సిందే.చిరంజీవి సమర్ధించడంతో పలువురు సినీ వర్గాల వారు కూడా జగన్‌కు జై కొట్టారు.

ఆ విశ్వాసంతో చిరంజీవికి కీలక పదవి కట్టబెట్టే విషయమై జగన్‌ ఆలోచించాడు.

రాజకీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవిని ఏపీ నుండి రాజ్యసభకు పంపించాలని భావించారట.

కాని రాజ్యసభ సీటును చిరంజీవి తిరష్కరించినట్లుగా సమాచారం అందుతోంది.గతంలో రాజ్యసభ సభ్యుడిగా చేసి మంత్రిగా కూడా చేసిన చిరంజీవి మళ్లీ రాజ్యసభ సీటు ఆఫర్‌ వస్తే ఎందుకు వెళ్లలేదు అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అవసరాల కోసం జగన్‌తో టచ్‌లో ఉన్నా చిరంజీవి పూర్తిగా తమ్ముడు పవన్‌కే మద్దతుగా నిలుస్తాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube