బాలయ్య వివాదంపై చిరు అభిప్రాయం ఇదేనా ?  

Chiranjeevi Reaction On Balakrishna Comments - Telugu Balakrishna, Corona Crisis Charity, Megastar Chiranjeevi, Nagababu, Thalassani Srinivas Yadav, Varun Tej

కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో చిరంజీవి ఆధ్వర్యంలోని కొంతమంది సినీ పెద్దలు టిఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసిన సంగతి తెలిసిందే.ఆ బృందం లో హీరో నాగార్జున, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, ఎన్కౌంటర్ శంకర్, నిర్మాతలు అల్లు అరవింద్, సీ కళ్యాణ్, దాము, దిల్ రాజు తదితరులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

 Chiranjeevi Reaction On Balakrishna Comments

అయితే తనకు చెప్పకుండానే వీరంతా ఆ సమావేశానికి వెళ్లడం పై ఆగ్రహం చెందిన బాలకృష్ణ మంత్రితో కలిసి హైదరాబాదులోని భూములు పంచుకునేందుకు వారంతా వెళ్లారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అసలు వివాదం మొదలైంది.దీనికి నాగబాబు తో పాటు, హీరో వరుణ్ తేజ తదితరులు బాలకృష్ణకు గట్టిగానే కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

రోజు రోజుకు ఈ వివాదం మరింత ముదిరిలా కనిపించడం తో రంగంలోకి దిగిన తమ్మారెడ్డి భరద్వాజ వంటి సినీ పెద్దలు ఈ వివాదానికి బ్రేక్ వేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు.

బాలయ్య వివాదంపై చిరు అభిప్రాయం ఇదేనా -Latest News-Telugu Tollywood Photo Image

ఇక ఇప్పటికే బాలయ్య వివాదంపై సినీ పెద్దలక కొంతమంది చిరంజీవి నివాసం లో చర్చించుకున్నారు.

ఈ వ్యవహారాలు ఇంతగా వేడెక్కుతున్నా,ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంలో స్పందించలేదు.చిరంజీవి స్పందిస్తారని చాలామంది భావించినా, ఆయన అటు నాగబాబు, వరుణ్ తేజ ను కట్టడి చేయడంలో గాని, బాలయ్య వ్యాఖ్యలను ఖండించడం కానీ చేయలేదు.

ఇదే విషయమై చిరు సన్నిహితులు కొంతమంది ఆయన దగ్గర వ్యాఖ్యానించగా చిరంజీవి ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారట.

ఇటువంటి చిన్న చిన్న గొడవలు రావడం సహజమేనని, ప్రతి చిన్న విషయానికి స్పందిస్తూ వెళ్తే చాలా విషయాలపై స్పందించాల్సి వస్తుందని, కొద్ది రోజులు ఆగితే ఈ వ్యవహారాలు అన్నీ సర్దుకుంటాయని చెప్పినట్లు తెలుస్తోంది.బాలయ్య ఏదో ఆవేశంలో అలా అని ఉంటారని, ఆయనను కలిసి మాట్లాడితే సమస్య అక్కడితో ముగిసిపోతుంది అని వ్యాఖ్యానించినట్లు సమాచారం.చిరు తన సన్నిహితుల దగ్గర చెప్పిన వ్యాఖ్యలను బట్టి చూస్తే త్వరలోనే ఆయన బాలయ్యను కలిసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు