అన్నయ్య మళ్ళీ రిపీట్... అన్నదమ్ముల పాత్రల్లో మెగాస్టార్, మాస్ మహారాజ్?

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం మెగాస్టార్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.

 Megastar Chiranjeevi And Raviteja In Brothers Role In Director Bobby Movie Detai-TeluguStop.com

వరుస సినిమాల్లో నటిస్తూ చిరు దూసుకు పోతున్నాడు.చిరంజీవి, తనయుడు రామ్ చరణ్ తో కలిసి నటించిన ఆచార్య సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న విషయం అందరికి తెలిసిందే.

ఈ సినిమాతో పాటు గాడ్ ఫాదర్, బోళా శంకర్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.అంతేకాకుండా దర్శకుడు బాబీ దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక దర్శకుడు బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ను పెట్టాలి అని చిత్ర బృందం ఆలోచిస్తోందట.

ఈ సినిమా వైజాగ్ షిప్ యార్డ్ నేపథ్యంలో మాస్ యాక్షన్ మూవీ గా తెరకెక్కనుందని సమాచారం.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాలో చిరంజీవి తమ్ముడి పాత్రలో రవితేజ అలరించనున్నాడు అని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో రవితేజ పాత్ర  సుమారు 40 నిమిషాలు ఉంటుంది అని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.ఒకవేళ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు నిజం అయితే దాదాపుగా 22 ఏళ్ల తర్వాత చిరంజీవి, రవితేజ కలిసి మరొకసారి అన్నదమ్ముల పాత్రలో అలరించనున్నారు.

Telugu Acharya, Annayya, Bhola Shankar, Brothers Role, Chiranjeevi, Bobby, Ram C

చిరంజీవి, రవితేజ 2000 సంవత్సరంలో వచ్చిన అన్నయ్య సినిమాలో అన్నదమ్ములుగా నటించిన విషయం అందరికి తెలిసిందే.ఈ సినిమా అప్పట్లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఇకపోతే ఈ సినిమా లో చిరంజీవి అండర్ కవర్ పోలీస్ పాత్రలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.సోషల్ మీడియా వినిపిస్తున్న వార్తలను బట్టి చూస్తే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Telugu Acharya, Annayya, Bhola Shankar, Brothers Role, Chiranjeevi, Bobby, Ram C

మొత్తానికి చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోవడమే కాకుండా, ఈ ఏజ్ లో కూడా కుర్ర హీరోల వరుస సినిమాలు చేస్తున్నాడు.తన తనయుడు రామ్ చరణ్ కి ధీటుగా సినిమాలు తీస్తూ రామ్ చరణ్ కంటే రెండు మూడు ఎక్కువ ప్రాజెక్టులు చేస్తున్నాడు చిరంజీవి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube