ఆచార్య రివ్యూ: చిరు, చెర్రీ చేసే సినిమా కాదు భయ్యా!

డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఆచార్య. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కీలక పాత్రలో నటించారు.ఇందులో పూజా హెగ్డే, తనికెళ్ల భరణి తదితరులు నటించారు.ఇక మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అండ్ రామ్ చరణ్ నిర్మాత బాధ్యతలు చేపట్టారు.ఇక ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూడగా మొత్తానికి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా మెగా అభిమానులను ఎలా మెప్పించిందో తెలుసుకుందాం.

 Megastar Chiranjeevi Acharya Movie Review And Rating, Chiranjeevi,ram Charan,ach-TeluguStop.com

కథ:

Telugu Acharya, Acharya Public, Acharya Review, Chiranjeevi, Koratala Siva, Pooj

ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ అనే పాత్రలో ధర్మస్థలి గురుకులం సంరక్షకుడిగా బాధ్యతలు వ్యవహరిస్తాడు.అక్కడ స్థానికులకు రక్షణ గా ఉంటాడు.ఇక ఆ సమయంలో ధర్మస్థలి పై బసవ (సోనూ సూద్) మనసు పడుతుంది.ఎలాగైనా ఆ ధర్మస్థలి ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తాడు.ఇక దానికి అడ్డుకట్ట ఉన్నందుకు సిద్ధను తప్పించాలని చూస్తాడు.కానీ కొన్ని కారణాల వల్ల ధర్మస్థలిని వదిలేస్తాడు సిద్ధ.

దాంతో ఆ ధర్మస్థలి అనుకోకుండా కొన్ని సమస్యలలో పడుతుంది.ఆ సమయంలోనే అక్కడికి ఆచార్య వస్తాడు.

మరి ఆచార్య ఆ ధర్మస్థల సమస్యలను తీరుస్తాడా అనేది.అసలు ఆచార్య, సిద్ధ కు ఉన్న సంబంధం ఏంటి అనేది మిగిలిన కథ లోనిది.

నటినటుల నటన:

Telugu Acharya, Acharya Public, Acharya Review, Chiranjeevi, Koratala Siva, Pooj

నటుల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.ఈ సినిమాలో కూడా తన పర్ఫామెన్స్ రుచిని చూపించాడు.ప్రతి ఒక్క సన్నివేశంలో బాగా లీనమయ్యాడు.ఇక డ్యాన్స్ విషయంలో మాత్రం బాగా ఇరగదీశాడు.అంతేకాకుండా రామ్ చరణ్ కూడా అద్భుతంగా నటించాడు.తన పాత్రకు తాను బాగా సెట్ అయ్యాడు.

హీరోయిన్ పూజా హెగ్డే కూడా అద్భుతంగా నటించింది.తదితరులు తమ పాత్రలలో లీనమయ్యారు.

టెక్నికల్:

Telugu Acharya, Acharya Public, Acharya Review, Chiranjeevi, Koratala Siva, Pooj

టెక్నికల్ పరంగా ఈ సినిమా విడుదల కంటే ముందే ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఈ సినిమాకు మణిశర్మ పాటలను, నేపధ్య సంగీతాన్ని అందించగా ఎందుకో సినిమా విడుదల తర్వాత అంతగా మెప్పించలేకపోయాడు అన్నట్లు తెలుస్తుంది.అంతే కాకుండా డైరెక్టర్ కొరటాల శివ కూడా ఈ సినిమా నుంచి అంతగా గుర్తింపు తెచ్చుకోలేక పోయాడు.సినిమాటోగ్రఫీ మాత్రం అద్భుతంగా ఉంది.చాలావరకు నాచురల్ సన్నివేశాలు ఉన్నాయి.

విశ్లేషణ:

Telugu Acharya, Acharya Public, Acharya Review, Chiranjeevi, Koratala Siva, Pooj

ఇక ఈ సినిమాకు డైరెక్టర్ కథ విషయంలో కాస్త మరింత కొత్తదనం పెడితే ఆకట్టుకునేది.ఇందులో చిరంజీవి, రామ్ చరణ్ లను చూపించిన విధానం బాగా ఆకట్టుకుంది.అంతేకాకుండా కొన్ని సన్నివేశాలు బాగా హైలెట్ గా నిలిచాయి.కానీ కథ విషయంలో మాత్రం డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడని అర్థమవుతుంది.

ప్లస్ పాయింట్స్:

Telugu Acharya, Acharya Public, Acharya Review, Chiranjeevi, Koratala Siva, Pooj

చిరంజీవి, రామ్ చరణ్ ల నటన, ధర్మస్థలి పై చూపించిన సన్నివేశాలు.

మైనస్ పాయింట్స్:

దర్శకత్వం లో కాస్త మార్పు ఉంటే బాగుండేది.స్క్రీన్ ప్లే కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది.కథ కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేనట్లు కనిపించింది.

బాటమ్ లైన్:

ఇక ఈ సినిమా మెగా అభిమానులకు ఒక మంచి అనుభూతిని కలిగిస్తుందని చెప్పవచ్చు.కానీ సినిమా మొత్తం కాస్త నిరాశగానే అనిపించింది.నిజానికి ఈ సినిమా చిరంజీవి, రామ్ చరణ్ కు అంతగా సెట్ కాలేనట్లు కనిపించింది.

రేటింగ్: 2.75/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube