'ఆచార్య' సిద్దా టీజర్.. మెగా అభిమానుల పండుగ షురూ

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా లో చరణ్ కీలక పాత్ర లో కనిపించబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా కు కొరటాల శివ దర్శకత్వం వహించాడు.

 Chiranjeevi Ram Charan Movie Acharya Tease Coming Soon , Acharya, Chirenjeevi, M-TeluguStop.com

మొదట ఈ సినిమా లో చరణ్‌ పోషించిన సిద్దా పాత్ర ను చిన్నగానే అనుకున్నారు.కాని షూటింగ్‌ ప్రారంభం అయిన తర్వాత ఆ పాత్రను పెంచుతూ పోయారు.

చరణ్ మరియు చిరంజీవి లు కలిసి చాలా సమయం స్క్రీన్‌ పై కనిపిస్తారు.మొత్తంగా చెప్పాలంటే ఇది చిరంజీవి సినిమా మాత్రమే కాదు.

ఇదో మంచి మల్టీ స్టారర్ సినిమా అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా లో ఎన్టీఆర్‌ మరియు చరణ్ లు కలిసి నటించారు.

ఆ సినిమా లో ఇద్దరు హీరోల పాత్రలకు సంబంధించి వేరు వేరు టీజర్ లను విడుదల చేయడం జరిగింది.అందుకే ఇప్పుడు ఆచార్య సినిమా నుండి కూడా మొదట సిద్దా పాత్ర టీజర్ రాబోతుందట.

Telugu Acharya, Chiranjeevi, Ram Charan, Sidda-Movie

చిరంజీవి ఈ టీజర్ ను ట్విట్టర్ ద్వారా ఈనెల 28న విడుదల చేయబోతున్నారు.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను అభిమానులు పండుగల చూస్తున్నారు.ఆ పండుగ ఫిబ్రవరిలో రాబోతుంది.కాని అంతకు ముందే సినిమా కు సంబంధించిన టీజర్ ను విడుదల చేయడం వల్ల అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.ఖచ్చితంగా ఇదో మంచి నిర్ణయం  అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.నెట్టింట చరణ్‌ సిద్దా టీజర్ కు సంబంధించిన హ్యాట్ ట్యాగ్స్ వైరల్‌ అవుతున్నాయి.

పెద్ద ఎత్తున అంచనాలున్న ఆచార్య సినిమా లో చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించిన విషయం తెల్సిందే.ఇక చిరు కు జోడీగా కాజల్ నటించింది.

ఈ సినిమా కొరటాల చాలా తక్కువ సమయంలో పూర్తి చేశాడు.కాని కరోనా వల్ల ఎక్కువ సమయం గ్యాప్ వచ్చింది.

వచ్చే ఫ్రిబవరిలో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube