ఆచార్య అప్‌డేట్‌ః హైదరాబాద్‌ తిరిగి వచ్చేసిన రామ్‌ చరణ్‌

మెగా స్టార్‌ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ నిన్నటి వరకు గోదావరి జిల్లా మేరేడుమిల్లి అటవి ప్రాంతంలో జరిగిన విషయం తెల్సిందే.దాదాపు గా మూడు వారాల పాటు చిరంజీవి మరియు చరణ్‌ లు అక్కడ షూటింగ్ లో పాల్గొన్నారు.

 Chiranjeevi Ram Charan Acharya Movie Shooting Update-TeluguStop.com

చరణ్‌ పై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది.చరణ్‌ మరియు చిరంజీవిల కాంబోలో వచ్చే సీన్స్‌ అభిమానులతో పాటు అందరికి కూడా రోమాలు నిక్కబొడిచేలా ఉంటాయంటూ చెబుతున్నారు.

పెద్ద ఎత్తున ఈ సీన్స్‌ ను కొటాల శివ తెరకెక్కించాడు.దాదాపు గా మూడు వారాల పాటు ఈ షెడ్యూల్ ను చేశాడు కనుక సినిమా లో ఎక్కువ సమయం వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

 Chiranjeevi Ram Charan Acharya Movie Shooting Update-ఆచార్య అప్‌డేట్‌ః హైదరాబాద్‌ తిరిగి వచ్చేసిన రామ్‌ చరణ్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇటీవలే చరణ్‌ మరియు చిరుల కాంబో షూటింగ్ ను చూసేందుకు గాను ఉపాసన రాజమండ్రి విమానాశ్రయంలో దిగి మేరేడు మిల్లి వెళ్లిన విషయం తెల్సిందే.

ఉపాసన రెండు రోజులు షూటింగ్ ను చూసి అక్కడ వాతావరణంను చరణ్‌ తో కలిసి ఎంజాయ్‌ చేసి నేడు ఉదయం తిరిగి హైదరాబాద్‌ వచ్చేశారు.

ఆచార్య సినిమా విడుదల తేదీ ఇప్పటికే ఖరారు అయ్యింది.ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల లోనే సినిమా ను ముగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.మరో వారం నుండి పది రోజుల పాటు చరణ్‌ ఆచార్య సినిమా షూటింగ్‌ లో జాయిన్‌ అయ్యే అవకాశం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ప్రస్తుతం సినిమా కు సంబంధించిన చివరి షెడ్యూల్‌ కోసం హైదరాబాద్‌ లో మళ్లీ ఒక సెట్‌ ను ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది.

మొత్తానికి ఆచార్య లో చిరు మరియు చరణ్‌ ల కాంబో సీన్స్ పూర్తి అయిన నేపథ్యంలో అభిమానులు సినిమా పై మరింతగా అంచనాలు పెంచుకుంటున్నారు.

#Chiranjeevi #AcharyaMovie #Ram Charan #Koratala Shiva #Acharya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు