దసరా పై దృష్టి పెట్టిన మెగా స్టార్‌.. ఇంకా ఎన్నో!

మెగా స్టార్‌ చిరంజీవి ఆచార్య సినిమా కు అనుకున్నప్పటి నుండి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి.సైరా సినిమా సమయంలోనే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించాలని కొరటాల శివ భావించాడు.

 Chiranjeevi Ram Charan Acharya Movie Release Date , Chiranjeevi, Ram Charan, Ach-TeluguStop.com

కాని ఒక వైపు సైరా చేస్తూ మరో వైపు ఈ సినిమా ను చేయడం కష్టంగా భావించిన చిరంజీవి ఆ సినిమా తర్వాత ఆచార్య ను మొదలు పెట్టాడు.ఆచార్య మొదలు పెట్టేందుకు ఆరు నెలల సమయం తీసుకున్న చిరంజీవి వంద రోజుల్లోనే పూర్తి చేద్దాం అంటూ కొరటాల శివ కు సూచించాడు.

కొరటాల వంద రోజుల లోపు లోనే సినిమా ను పూర్తి చేయాలని భావించాడు.అందుకు తగ్గట్లుగా ప్లాన్‌ చేసుకున్నాడు.కాని కరోనా మొత్తం రివర్స్ చేసింది.90 రోజుల సినిమా అనుకుంటే ఏకంగా ఏళ్లకు ఏళ్లు వాయిదా పడాల్సి వస్తుంది.పెద్ద ఎత్తున అంచనాలున్న ఆచార్య సినిమా ను ఎట్టకేలకు విడుదల తేదీ విషయంలో స్పష్టత ఇచ్చేందుకు మేకర్స్ సిద్దం అయ్యారు.

Telugu Acharya, Acharya Dasara, Balakrishna, Chiranjeevi, Chiranjeeviram, Dasara

కరోనా సెంకడ్‌ వేవ్‌ కారణంగా మే లో విడుదల అవ్వాల్సిన ఆచార్య వాయిదా పడింది.సెకండ్‌ వేవ్‌ తగ్గి పోయింది.తెలంగాణలో లాక్ డౌన్‌ ఎత్తి వేశారు.

ఏపీలో ఆంక్షలు సడలిస్తూ వస్తున్నారు.కనుక థియేటర్లు మళ్లీ జులై నుండి సందడి మొదలయ్యే అవకావం ఉందని అంతా భావిస్తున్నారు.

కనుక పెద్ద హీరోల సినిమా లు సెప్టెంబర్‌ మరియు అక్టోబర్‌ నెల్లలో విడుదలకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఇటీవలే బాలయ్య మూవీ ని వినాయక చవితి సందర్బంగా సెప్టెంబర్‌ లో విడుదల చేస్తారని ప్రకటన వచ్చింది.

ఇక ఆచార్య సినిమా ను అక్టోబర్‌ లో దసరా సీజన్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు.షూటింగ్‌ కేవలం వారం రోజుల షెడ్యూల్ మాత్రమే బ్యాలన్స్ ఉంది.

అది కూడా సాధ్యం అయినంత త్వరగా పూర్తి చేస్తారని తెలుస్తోంది.ఈ సినిమా లో చరన్ కూడా నటించడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

కాజల్ మరియు పూజా హెగ్డే లు హీరోయిన్స్ గా నటించారు.దసరాకు ఈ సినిమా వస్తే టాలీవుడ్‌ సండి మొదలు అయినట్లే అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube