చిరు చెప్పిన ఆ జాబితాలో పూరి లేడు ఎందుకని?

చిరంజీవి రీ ఎంట్రీ మూవీని మొదట పూరి జగన్నాధ్‌తో అనుకున్నారు.ఆయన స్క్రిప్ట్‌ కూడా రెడీ చేశాడు.

 Chiranjeevi Puri Jagannath Movie-TeluguStop.com

ఆటో జానీ అనే టైటిల్‌ను కూడా అనుకున్నారు.మొదటి సగం కథ రెడీ అయ్యింది.రెండవ సగం కూడా రెడీ చేసి వినిపించేందుకు సిద్దం అయిన సమయంలో చిరంజీవి ఖైదీ నెం.150 చిత్రంను ప్రకటించాడు.ఆ సినిమా గురించి తనకు చెప్పలేదు అంటూ పూరి జగన్నాధ్‌ స్వయంగా మాట్లాడుతూ కాస్త అసహనం వ్యక్తం చేశాడు.చిరంజీవితో మళ్లీ కూడా పూరి సినిమాను చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో ఫైటర్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న పూరి జగన్నాద్‌ ఆ తర్వాత చేయబోతున్న సినిమా విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.అయితే తప్పకుండా అది చిరంజీవితో ఉంటుందని కొందరు భావించారు.

 Chiranjeevi Puri Jagannath Movie-చిరు చెప్పిన ఆ జాబితాలో పూరి లేడు ఎందుకని-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చిరంజీవి కోసం స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నట్లుగా ఆమద్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.పూరి మాత్రం చాలా బలంగా చిరంజీవితో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తుంటే చిరంజీవి మాత్రం పూరితో సినిమా విషయంలో ఆసక్తిని కనబర్చడం లేదని తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది.

తాజాగా చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో సుజీత్‌, మెహర్‌ రమేష్‌ వంటి యంగ్‌ హీరోలతో సినిమాలు చేయాలనుకుంటున్నాను.నన్ను చూస్తూ పెరిగారు కనుక వారికి నన్ను కొత్తగా చూపించాలనే ఆసక్తి ఉంటుంది.అందుకే యంగ్‌ డైరెక్టర్స్‌తో కలిసి సినిమా చేయాలనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు.అంటే పూరితో చిరుకు సినిమా ఆసక్తి లేదని చెప్పకనే చెప్పాడు.అయినా ఇప్పటికి కూడా పూరి చిరంజీవితో సినిమా చేసే ప్రయత్నాలు చేస్తాడా అనేది చూడాలి.

#Chiranjeevi #Movies #Young Directors #Meher Ramesh #Puri Jagannath

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు