చిరు తుంటరి ట్వీట్‌తో పూరి చెంప పగిలిందట  

Chiranjeevi Puri Jaganath Bankok Thailand Corona Virus Tollywood - Telugu Bankok, Chiranjeevi, Corona Virus, Puri Jaganath, Thailand, Tollywood

ట్విట్టర్‌లో ఎంటర్‌ అయిన మెగాస్టార్‌ చిరంజీవి జోరుగా ట్వీట్స్‌ చేశాడు, ఇంకా చేస్తూనే ఉన్నాడు.చిరంజీవి ట్విట్టర్‌లో ఎంటర్‌ అవ్వడంపై చాలా మంది ఆనందంను వ్యక్తం చేస్తూ ఆయనకు వెల్‌కం పలికారు.

 Chiranjeevi Puri Jaganath Bankok Thailand Corona Virus Tollywood

తనకు వెల్‌కం పలికిన సెలబ్రెటీలకు విభిన్నంగా థ్యాంక్స్‌ చెప్పాడు.ఆ క్రమంలో పూరి జగన్నాధ్‌ చెప్పిన వెల్‌కంకు చిరంజీవి చేసిన ట్వీట్‌ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఆ ట్వీట్‌ పూరి ఇమేజ్‌ బ్యాడ్‌ చేసేలా ఉందనే విమర్శలు కూడా వ్యక్తం అయ్యాయి.

చిరు తుంటరి ట్వీట్‌తో పూరి చెంప పగిలిందట-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ కరోనా కారణంగా థాయిలాండ్‌, బ్యాంకాక్‌ బీచ్‌లను నువ్వు బాగా మిస్‌ అవుతూ ఉంటావు కదా అంటూ సరదాగా తుంటరి ట్వీట్‌ను మెగాస్టార్‌ చేశాడు.ఆ ట్వీట్‌పై దర్శకుడు పూరి స్పందించాడు.ఈ ట్వీట్‌ చూసిన సమయంలో నా భర్య పక్కనే ఉంది.

ట్వీట్‌ను చూసి నా చెంప పగులగొట్టింది అంటూ పూరి కామెంట్స్‌ చేశాడు.చిరంజీవి గారు ఆ విషయాన్ని ఎందుకు చెప్పాడో నాకే అర్థం కాలేదు అంటూ పూరి అసహనం వ్యక్తం చేశాడు.

కొత్త సినిమా మొదలు పెట్టాలంటే నెల రెండు నెలల పాటు పూరి థాయిలాండ్‌ బ్యాంకాక్‌ వెళ్లి వస్తాడు.అక్కడ ప్రశాంతంగా స్క్రిప్ట్‌లు రాసుకుని వస్తాడు.ఆ తర్వాత షూటింగ్స్‌ మొదలు పెడతాడు.తన సినిమాల కథల నేపథ్యంను కూడా ఎక్కువగా అక్కడే ఎంచుకుంటాడు.

కనుక షూటింగ్స్‌ను ఎక్కువగా అక్కడే షూట్‌ చేస్తాడు.భవిష్యత్తులో బ్యాంకాక్‌లోనే సెటిల్‌ అవ్వాలని ఉంది అంటూ గతంలో పూరి ఒకసారి అన్నాడు.

అందుకే చిరు తుంటరిగా ఆ వ్యాఖ్యలు చేసి ఉంటాడు.కాని పూరికి మాత్రం ఆ ట్వీట్‌ పరువు తీసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు