యాంకర్ 'రష్మీ'ని తారాస్థాయిలో పొగిడిన చిరంజీవి.. కారణం?

ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా ఎంతోపాపులారిటీని సంపాదించుకున్నారు రష్మి.అంతేకాకుండా బుల్లితెరపై వివిధ షోలలో పాల్గొంటూ ఎంతో ప్రేక్షకాదరణ పొందారు.

 Chiranjeevi Praises Anchor Rashmi , Chiranjeevi, Praises, Anchor Rashmi, Corona-TeluguStop.com

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ, బుల్లితెరపై ఎంతో గ్లామరస్ గా, సెటైర్లు వేస్తూ కనిపించే రష్మీ తెరవెనుక మాత్రం మంచి సహృదయంతో, సేవాభావం ఉన్న వ్యక్తి అని తాజాగా నిరూపించుకున్నారు.ఈమె సేవ భావాన్ని చూసి మెగాస్టార్ చిరంజీవి చేత ప్రశంసలను అందుకున్నారు.

కరోనా సమయంలో ప్రజలందరూ కేవలం ఇళ్లకు మాత్రమే పరిమితమయ్యారు.కానీ బయట మూగజీవుల ఆకలి కేకలను తెలుసుకున్న రష్మి ధైర్యంగా ముందుకు వచ్చి ఆకలితో అలమటిస్తున్న మూగజీవాలకు ఆహారాన్ని అందించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.

కరోనా వంటి క్లిష్ట సమయాలలో బకెట్ చేతపట్టుకొని రోడ్డుపైకి వచ్చి మూగజీవాలకు ఆహారం అందించింది.అంతే కాకుండా మరిన్ని సేవా కార్యక్రమాలలో ఎంతో చురుకుగా పాల్గొన్నారు.

Telugu Anchor Rashmi, Chiranjeevi, Corona, Covid, Dog Rescue, Praises-Movie

రష్మికకు కుక్కలు అంటే ఎంతో ఇష్టం ఉండడంతో వాటికి ఏదైనా సమస్య అని తెలిస్తే వెంటనే స్పందించి వాటిని సంరక్షిస్తున్నారు.వాటికి ఏమైనా అయితే ఎంతో తల్లడిల్లిపోతుంది.అలాంటి రష్మి తాజాగా ఓ అవార్డును సొంతం చేసుకున్నారు.కరోనా సమయంలో పోరాడిన కొందరికి ఓ సమస్థ అవార్డులను ప్రకటించింది ఇందులో భాగంగానే ఆ అవార్డును సొంతం చేసుకున్నారు.

అలా ఆ అవార్డును చిరంజీవి చేతుల మీదుగా రష్మి అందుకున్నారు.

అవార్డు తీసుకున్న రష్మి ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ….

కరోనా అనేది జంతువులకు రాదు.అది కేవలం మనుషులను హెచ్చరించడానికి దేవుడు పంపాడని మాట్లాడిన మాటలు మెగాస్టార్ చిరంజీవిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అదే కార్యక్రమంలోనే చిరంజీవి మాట్లాడుతూ ,రష్మి మాటలను మరొకసారి ప్రస్తావించాడు.ఆ విషయంలో రష్మీ ఎంతో చక్కగా, నిజం మాట్లాడిందని యాంకర్ రష్మీ పై చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube