సంక్రాంతి బరి నుండి ఆ ఇద్దరు కూడా ఔట్!  

Chiranjeevi Prabhas Acharya - Telugu Acharya, Chiranjeevi, Prabhas, Prabhas 20, Sankranti Race

టాలీవుడ్‌లో సినిమాలను రిలీజ్ చేసేటప్పుడు మంచి సమయాన్ని చూసుకుని మరీ రిలీజ్ చేస్తుంటారు.ఇక పండుగ సీజన్‌లో సినిమాలు రిలీజ్ చేస్తే, అవి హిట్ అయితే మాత్రం ఆ చిత్ర యూనిట్‌కు అది నిజమైన పండగ అని చెప్పాలి.

 Chiranjeevi Prabhas Acharya

కాగా టాలీవుడ్‌లో సంక్రాంతి పండగకు సినిమాలు ఎలా పోటీపడుతాయో అందరికీ తెలిసిందే.ప్రతి యేటా సంక్రాంతి బరిలో తమ సినిమాను ఉండేలా చూసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు స్టార్ హీరోలు.

కానీ రాబోయే సంక్రాంతి బరిలో తమ సినిమాను రిలీజ్ చేయబోయమంటూ పలువురు స్టార్ హీరోలు వెనకడుగు వేస్తున్నారు.ఇంతకీ వారు ఇలా ఎందుకు అంటున్నారో తెలుసా? ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా నెలకొన్న లాక్‌డౌన్ వల్ల తమ సినిమాలు అనుకున్న సమయంలో పూర్తి కావడం లేదు.దీంతో వారు సంక్రాంతి బరిలో రిలీజ్ చేద్దామనుకున్న సినిమాను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇందులో ముఖ్యంగా చెప్పుకునే సినిమా ఆర్ఆర్ఆర్.

సంక్రాంతి బరి నుండి ఆ ఇద్దరు కూడా ఔట్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను జనవరి 8న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ లాక్‌డౌన్ కారణంగా సినిమా మరింత ఆలస్యం కావడంతో ఈ సినిమాను వచ్చే వేసవిలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాత తెలిపాడు.

ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాను తొలుత ఈ ఏడాదిలోనే రిలీజ్ చేద్దామని అనుకున్న లాక్‌డౌన్ కారణంగా సంక్రాంతి బరిలో దించుదామని అనుకున్నారు.కానీ ఇప్పుడు అది కూడా కుదరడం లేదు.

అటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రం పరిస్థితి కూడా అంతే.మొత్తానికి ఆర్ఆర్ఆర్‌తో పాటు ఈ ఇద్దరు స్టార్ హీరోలు కూడా తమ సినిమాలను సంక్రాంతి బరిలో నుండి తప్పించడంతో మరి పండగకు ఏయే సినిమాలు వస్తాయా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test