విష్ణును ఏకగ్రీవ్రం చేస్తానంటూ చిరంజీవి ఓపెన్ ఆఫర్.. కానీ అలా జరగడంతో?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే.అయితే అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్టు ఎవరు ముందుగా ప్రకటించారనే ప్రశ్నకు ప్రకాష్ రాజ్ ముందుగా ప్రకటించారని మెగా కాంపౌండ్ కు చెందిన సభ్యులు, విష్ణు ముందుగా ప్రకటించాడని అతని ప్యానెల్ సభ్యులు చెబుతున్నారు.

 Chiranjeevi Open Offer On Maa President Post But Mohan Baabu Rejected-TeluguStop.com

అయితే తాజాగా నటుడు బెనర్జీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పదవికి సంబంధించి చిరంజీవి మోహన్ బాబు మధ్య జరిగిన చర్చ గురించి చెప్పుకొచ్చారు.

బెనర్జీ మాట్లాడుతూ మొదట ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవి కోసం ఎంట్రీ ఇచ్చారని చిరంజీవి మోహన్ బాబుతో మంచు విష్ణును అభ్యర్థిగా వెనక్కు తీసుకోవాలని కోరారని చెప్పుకొచ్చారు.

 Chiranjeevi Open Offer On Maa President Post But Mohan Baabu Rejected-విష్ణును ఏకగ్రీవ్రం చేస్తానంటూ చిరంజీవి ఓపెన్ ఆఫర్.. కానీ అలా జరగడంతో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ విధంగా తనకు సహకరిస్తే వచ్చే టర్మ్ లో విష్ణును ఏకగ్రీవం చేస్తామని హామీ కూడా ఇచ్చారని ఈ విధంగా చిరంజీవి మోహన్ బాబుకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారని బెనర్జీ తెలిపారు.ఆ తర్వాత మోహన్ బాబు అధ్యక్ష పదవికి పోటీ చేస్తే ఏకగ్రీవం చేయాలని చిరంజీవి భావించారని బెనర్జీ పేర్కొన్నారు.

అయితే మోహన్ బాబు మాత్రం తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా విష్ణును పోటీ చేయించడంతో సమస్య వచ్చిందని బెనర్జీ చెప్పుకొచ్చారు.

Telugu Actor Banerjee, Chiranjeevi, Chiranjeevi Offer To Vishnu, Interesting Facts, Maa President, Manchu Vishnu, Mohan Babu, Open Offer, Prakash Raj, Senior Naresh, Tollywood-Movie

మోహన్ బాబుదే తప్పు అనే విధంగా బెనర్జీ కామెంట్లు చేయడం గమనార్హం.బెనర్జీ కామెంట్లపై మోహన్ బాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు ఎన్నికల్లో కృష్ణుని పాత్రను పోషిస్తానని చెప్పిన నరేష్ గురించి షాకింగ్ కామెంట్లు చేశారు.

Telugu Actor Banerjee, Chiranjeevi, Chiranjeevi Offer To Vishnu, Interesting Facts, Maa President, Manchu Vishnu, Mohan Babu, Open Offer, Prakash Raj, Senior Naresh, Tollywood-Movie

నరేష్ వివాదానికి మూలకారణమని ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు భావిస్తున్నారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున గెలిచిన సభ్యులు మాట్లాడితే బాగుంటుందని ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు చెప్పుకొచ్చారు.విష్ణు విజయం సాధించిన తర్వాత ఏ అధికారంతో నరేష్ మాట్లాడుతున్నాడని ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు ప్రశ్నించడం గమనార్హం.

#Banerjee #MAA #Naresh #Manchu Vishnu #Mohan Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు