మెగా అభిమానుల్లో నెంబర్ వన్ సునీల్..!

స్టార్ కమెడియన్ నుండి హీరోగా టర్న్ అయిన సునీల్ సక్సెస్ కోసం తంటాలు పడుతూనే ఉన్నాడు.కృష్ణాష్టమిగా నిరాశ పరచిన సునీల్ త్వరలో జక్కన్నగా రాబోతున్నాడు.

 Chiranjeevi Number One Fan Is Sunil-TeluguStop.com

వంశీ ఆకెళ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రేమ కథా చిత్రం నిర్మాత సుదర్శన్ రెడ్డి నిర్మించారు.నిన్న జరిగిన జక్కన్న ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు.

ఇక చిరు ప్రసంగంతో ఆడిటోరియం దద్దరిల్లింది.తన అభిమాని అయిన సునీల్ కష్టంతో పైకి వచ్చాడు.

ఇక తను చేసే డ్యాన్సులు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందంటూ, మన దగ్గర డ్యాన్సులతో అలరించే హీరోల్లోసునీల్ ఒకడని అన్నారు.తన పాటలకు స్టేజ్ డ్యాన్సులు చేసుకుంటూ సునీల్ ఇప్పుడు ఈ స్టేజ్ కు రావడం ఎంతో గర్వంగా ఉంది.

తన అభిమానుల్లో నెంబర్ వన్ సునీల్ అనేశాడు చిరు.

అభిమానులు సక్సెస్ సాధించినప్పుడు దాన్ని తాను ఇంకా ఎంజాయ్ చేస్తానని అన్నారు చిరంజీవి.

ఇక సినిమా కోసం ఎంతో కష్టపడ్డ సునీల్ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకోవాలని ఆకాంక్షించారు.ఇక చిత్రానికి పనిచేసిన టెక్నికల్ టీం అంతటికి తన బెస్ట్ విశెష్ అందించిన చిరు తన హుశారైన ప్రసంగంతో తన అభిమానులతో పాటుగా సునీల్ అభిమానులను ఉత్సాహంలో నింపారు.

ఇక కొంతకాలంగా సక్సెస్ కోసం మొహమాచి ఉన్న సునీల్ ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అంటూ నమ్మకం వెళ్ళబుచ్చాడు.సినిమాలో కేవలం కామెడీనే ఉంటుందని థియేటర్ కు వచ్చి హాయిగా నవ్వుకోవచ్చని హామీ ఇచ్చాడు.

దినేష్ మ్యూజిక్ అందించిన ఈ ఆడియో రొమాంటిక్ మెలోడీ సాంగ్స్ తో ఆల్బం నిండి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube