బాలకృష్ణ మాటలు చిరంజీవిని నొప్పించాయా… అందుకే సంచలన నిర్ణయం  

Chiranjeevi Not Interested To Participate On Tollywood Activities - Telugu Balakrishna,, Megastar, Telugu Cinema

టాలీవుడ్ సినిమాకి ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ తర్వాత ఆ స్థాయిలో చరిష్మా తెచ్చుకున్న హీరో అంటే మెగాస్టార్ చిరంజీవి అని చెప్పాలి.ఇక ఇండస్ట్రీకి గతంలో దాసరి నారాయణరావు పెద్దదిక్కుగా ఉండేవారు.

 Chiranjeevi Not Interested To Participate On Tollywood Activities

ఆయన మరణం తర్వాత దాసరి లేని లోటుని చిరంజీవి భర్తీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.ఈ కారణంగానే కొత్త వాళ్ళని సైతం ప్రోత్సహిస్తూ వారి సినిమా ఫంక్షన్ లకి వెళ్తున్నారు.

అలాగే తాజాగా లాక్ డౌన్ కష్ట కాలంలో ఇండస్ట్రీకి అండగా ఉండి కళాకారులని ఆదుకోవడంలో ముందుండి నడిపించారు.ఇలా అన్నింటా పెద్దన్న పాత్ర పోషిస్తూ దాసరి వారసత్వంలో చిరంజీవి నడిచే ప్రయత్నం చేస్తున్నారు.

బాలకృష్ణ మాటలు చిరంజీవిని నొప్పించాయా… అందుకే సంచలన నిర్ణయం-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే మొదటి నుంచి ఇండస్ట్రీ క్యాస్ట్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది.ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా చిరంజీవి, మెగా హీరోల హవా నడుస్తుంది.దీనిని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు.కొందరయితే బాహాటంగా వారి మీద తమ అసహనం వెళ్లగక్కుతున్నారు.

అయిన కూడా ఇండస్ట్రీలో ఎవరిని ఎలాంటి మాట అనకుండా అందరిని కలుపుకుకొని పోయే ప్రయత్నం చిరంజీవి చేస్తున్నారు.మరో వైపు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ఇండస్ట్రీకి రావాల్సినవి తెచ్చుకోవడంలో సఫలం అవుతున్నారు.

అయితే ఇక్కడ చిరంజీవి ఆధిపత్యం కొందరు భరించలేకపోతున్నారు.తాజాగా బాలకృష్ణ చిరంజీవి మీద, అలాగే ప్రభుత్వ పెద్దలతో చిరంజీవి ఇంట్లో పెట్టిన మీటింగ్ మీద సంచలన వాఖ్యలు చేసి, చిరంజీవి మీద కూడా ప్రత్యక్ష ఆరోపణలు చేశారు.

ఈ వ్యవహారంలో చిరంజీవి బాగానే హర్ట్ అయినట్లు తెలుస్తుంది.అందుకే ఇకపై అన్నింటికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇక సినిమాలకి సంబందించిన కార్యక్రమాలలో భాగం కాకూడదని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chiranjeevi Not Interested To Participate On Tollywood Activities Related Telugu News,Photos/Pics,Images..

footer-test