రేపటి మీటింగ్‌ చిరంజీవికి ఇష్టమేనా?

ఇటీవల టాలీవుడ్‌ పెద్దగా మెగాస్టార్‌ చిరంజీవి మారిపోయాడు.ఆ విషయాన్ని కొందరు జీర్ణించుకోలేక పోతున్నారు.

 Chiranjeevi Not Interested Meeting With Jagan, Chiranjeevi,jagan,tollywood,ap Cm-TeluguStop.com

ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జరిగిన భేటీకి తనను ఆహ్వానించలేదు అంటూ బాలకృష్ణ వ్యాఖ్యలు చేయడంతో చిరంజీవి ఆధిపత్యం ఆయన సహించలేక పోతున్నాడు, అందుకే బాలయ్య అలాంటి విమర్శలు చేశాడు అంటూ చాలా మంది డైరెక్ట్‌గానే అనేస్తున్నారు.అసూయతోనే బాలయ్య ఆ వ్యాఖ్యలు చేసి ఉంటాడు అంటూ అంతా అనుకుంటున్నారు.

బాలయ్య చేసిన వ్యాఖ్యలు చిరంజీవిని తీవ్రంగా బాధించాయి అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.అందుకే ఇకపై సినిమా పరిశ్రమకు చెందిన కార్యక్రమాలకు, ఇతర వివాదాలకు తాను దూరంగా ఉండాలని భావించాడట.

కాని తెలంగాణ సీఎంతో భేటీ అయ్యి ఏపీ సీఎంతో భేటీ కాకుంటే ఏపీ ప్రభుత్వం నుండి ఏమైనా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయేమో అనే ఉద్దేశ్యంతో కొందరి సలహా మేరకు ఏపీ సీఎం జగన్‌తో కూడా సినీ ప్రముఖులు హాజరు అయ్యేందుకు రెడీ అయ్యారు.

రేపు జగన్‌ నివాసంలో తెలుగు సినిమా ప్రముఖులు కలువబోతున్నారు.

ఈ భేటీకి చిరంజీవి హాజరు అయ్యేందుకు ఆసక్తి చూపలేదని అంటున్నారు.మీడియాలో తన గురించి కొందరు చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం అన్నాడట.

కాని ఆయన్ను బలవంతంగా ఒప్పించినట్లుగా తెలుస్తోంది.కొందరు ప్రముఖులు ఒత్తిడి చేసి ఒప్పించినట్లుగా తెలుస్తోంది.

జగన్‌తో భేటీ తర్వాత చిరంజీవి ఇలాంటి పెద్దరికపు పనులు నెత్తికి ఎత్తుకునే అవకాశం తక్కువ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube