ఆ డైరెక్టర్‌ను చిరు రిజెక్ట్ చేశాడా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య చిత్ర షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు చిత్ర యూనిట్.

 Chiranjeevi Not Impressed With Bobby, Chiranjeevi, Bobby, Acharya, Lucifer, Toll-TeluguStop.com

ఈ సినిమాలో చిరు సరికొత్త అవతారంలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమా పూర్తిగాక ముందే తన నెక్ట్స్ చిత్రాన్ని లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ క్రమంలో ఇప్పటికే మలయాళ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘లూసిఫర్’ను తెలుగులో రీమేక్ చేసేందుకు చిరు రెడీ అవుతున్నారు.

కాగా తమిళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘వేదాళం’ను కూడా చిరు రీమేక్ చేయాలని ఆలోచిస్తున్నాడు.

ఈ క్రమంలోనే పలువురు యంగ్ డైరెక్టర్లకు చిరు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.వారిలో సుజీత్, మెహర్ రమేష్, బాబీ లాంటి పేర్లు ఎక్కువగా వినిపించాయి.కాగా మెహర్ రమేష్‌తో సినిమాను చిరు ఫైనల్ చేసినట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.అయితే దర్శకుడు బాబీ చిరు కోసం స్ట్రెయిట్ తెలుగు కథను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ఆయన తన కథను చిరుకు వినిపించాడట.కానీ సినిమా కథ చిరుకు అంతగా నచ్చలేదని, దీంతో బాబీని చిరు రిజెక్ట్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

ఇప్పటికే సుజీత్‌ను రిజెక్ట్ చేసిన చిరు, లూసిఫర్ రీమేక్ విషయంలో వివి వినాయక్‌ను కూడా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.దీంతో ఈ సినిమా రీమేక్ బాధ్యత ఓ తమిళ దర్శకుడి చేతికి వెళ్లినట్లు తెలుస్తోంది.

అయితే తెలుగు కథను వినిపించిన బాబీని కూడా చిరు రిజెక్ట్ చేయడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.ఇలా వరుసబెట్టి డైరెక్టర్లను చిరు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాడా అని పలువురు ఆలోచిస్తున్నారు.

మరి చిరును స్ట్రెయిట్ తెలుగు కథతో ఏ డైరెక్టర్ మెప్పిస్తాడో చూడాలి అంటున్నారు మెగా ఫ్యాన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube