తమ్ముడి కోసం అన్నయ్య భారీ త్యాగం..ఇందుకేనా..?     2018-10-17   15:06:19  IST  Surya Krishna

గత కొన్ని రోజులుగా చిరజీవి కాంగ్రెస్ కి దూరం అవుతున్నారు అని రకరకాల వార్తలు వస్తున్న నేపధ్యంలో అన్నీ గాలి వార్తలుగానే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు తప్ప ఎక్కడా చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉంటారు అంటూ బల్ల గుద్ది మరీ చెప్పలేకపోతున్నారు..దానికి కారణం ఈ ధర్మ సందేహం వారిలో కూడా ఉండటమే..నిజంగా చిరజీవి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారా..? ఒక వేళ పార్టీని వీడితే రాజకీయ సన్యాసం తీసుకుంటారా లేదా తమ్ముడు జనసేనకి కాపు కాస్తారా అనే సందేహాలు అందరిలో ఉత్ఖంట రేపుతున్నాయి. ముఖ్యంగా మెగా అభిమానులని మాత్రం సందిగ్ధంలో పడేస్తున్నాయి..ఈ ధర్మ సందేహాలకి ఓ చిన్న విశ్లేషణ..

Chiranjeevi Not Going For The Campaign Of Congress Because Pawan-

Chiranjeevi Not Going For The Campaign Of Congress Because Pawan

అయితే చాలా మంది చెప్పుతున్నట్టుగా చిరు జనసేనలో చేరుతారా అంటే అది జరగక పోవచ్చు అనే అంటున్నారు చాలా మంది విశ్లేషకులు ఎందుకంటే ప్రజారాజ్యం పెట్టిన సమయంలో పవన్ ఎంత కమిట్మెంట్ గా పని చేశారో తెలుసు ఆ సమయంలో చిరు మానియా ఫలించక పార్టీ ఓడిపోవడంతో తప్పని సరి పరిస్థితులలో నేతల ఒత్తిళ్ళతో చిరు ప్రరాపాని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేశారు..దాంతో పవన్ కి చిరుకి మధ్య కొంత గ్యాప్ వచ్చిందని అందరికి తెలిసిందే అయితే ఇప్పుడు పవన్ ఒక పార్టీని స్థాపించి మళ్ళీ ఆ పార్టీలోకి చిరుని తీసుకువస్తే ఇప్పుడున్న జనసేన గ్రాఫ్ తగ్గి విమర్సల పాలు అవడం తప్ప ఉపయోగం ఉండదనేది అంచనా..అందుకే చిరు జనసేన లోకి రారు..ఇక.

చిరు కాంగ్రెస్ పార్టీలో ఉంటారా మీకో నమస్కారం అని కాంగ్రెస్ కి హ్యాండ్ ఇస్తారా అంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీని వీడుతారనే చెప్పాలి ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరుపున తప్పకుండా చిరు ప్రచారం చేయాల్సిందే ఈ తరుణంలో చిరు ఒక పక్క కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే మరో పక్క జనసేన అధినేతగా పవన్ తెలంగాణలో బీజేపీ కి కాని లేదా టీఆర్ఎస్ పార్టీ కి కాని మద్దతు ఇవ్వాల్సిన పరిస్తితి వస్తుంది దాంతో అన్న ఒక దారి తమ్ముడు ఒకదారి వీళ్ళ కుటుంభంలోనే సఖ్యతలేదు వీళ్ళు ప్రజలకి ఏమి చేస్తారు అంటూ వీరిపై ఎదురు దాడి జరిగే అవకాసం ఉంటుంది పైగా తెలంగాణాలో కాంగ్రెస్ టీడీపీ పొత్తులో ఉన్నాయి..మరి ఏపీలో టీడీపీని కాంగ్రెస్ పార్టీని విభేదిస్తున్న పవన్ చిరుపై విమర్శలు చేస్తాడా..కాంగ్రెస్ విధానాలని తప్పు పడుతున్న పవన పై కాంగ్రెస్ నేతగా చిరు విమర్శలు చేస్తాడా..? అంటే జరిగే పని కాదు..ఎందుకంటే ఎంతకాదన్నా తమ్ముడు పైగా.

Chiranjeevi Not Going For The Campaign Of Congress Because Pawan-

ఏపీలో మాంచి ఊపులో ఉన్న పార్టీ అన్నీ కలిసి వస్తే వచ్చే ఎన్నికల్లో ఏపీలో చక్రం తిప్పగల సత్తా ఉన్న పార్టీ మరి అలాంటి తమ్ముడికి చిరు పొగ పెడతాడు అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది పైగా మెగా ఫ్యామిలీ మొత్తం ఏపీలో ఎన్నికల ప్రచారానికి తరలి వస్తామని అంటోంది కూడా..సో ఇన్ని ఈక్వేషన్స్..ఇన్ని కాలిక్యులేషన్స్ మధ్య చిరు కాంగ్రెస్ లో కొనసాగడు..అలా అని జనసేన లోకి చేరే సాహసం చేయడు..ప్రస్తుతం సినిమాలపై దృష్టి పెట్టి ఎన్నికల తరువాత మాత్రమే జనసేన పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తాడని అంచనా వేయవచ్చు.