సైరా దెబ్బకు నో అని తేల్చేసిన చిరు!  

Chiranjeevi No To Periodic Movies - Telugu Acharya, Chiranjeevi, Chiru152, Sye Raa, Telugu Movie News

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో దాదాపు 9 ఏళ్ల తరువాత రీఎంట్రీ ఇచ్చి ఖైదీ నెంబర్ 150 చిత్రంతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్నాడు.ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో, తన 151వ చిత్రాన్ని ఓ పీరియాడికల్ మూవీగా చిరు తెరకెక్కించాడు.

 Chiranjeevi No To Periodic Movies - Telugu Acharya, Chiranjeevi, Chiru152, Sye Raa, Telugu Movie News-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

సైరా నరసింహారెడ్డి సినిమాతో మరోసారి అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు.తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాధ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు చిత్ర యూనిట్.

ఇక ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ బడ్జెట్‌తో పలు భాషల్లో రిలీజ్ చేశారు.అయితే ఈ సినిమా కేవలం సక్సెస్‌ను మాత్రమే అందుకోవడంతో చిరు చాలా నిరాశకు లోనయ్యారు.

సైరా దెబ్బకు నో అని తేల్చేసిన చిరు - Chiranjeevi No To Periodic Movies - Telugu Acharya, Chiranjeevi, Chiru152, Sye Raa, Telugu Movie News-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

భారీ ఆశలు పెట్టుకున్న ఈ పీరియాడికల్ మూవీ తనకు నిరాశను మిగిల్చిందని చిరు ఓ సందర్భంలో తెలిపారు.అయితే ఇప్పుడు ఓ సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో మనముందుకు రావడానికి చిరు రెడీ అవుతున్నారు.

ఈ సందర్భంలో చిరుకు మరో పీరియాడికల్ సబ్జెక్ట్‌ను ఓ దర్శకుడు వినిపించినట్లు తెలుస్తోంది.కథ విన్న చిరు పీరియాడికల్ సినిమాకు ససేమిరా అన్నట్లు తెలుస్తోంది.

కొంతకాలం వరకు కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితం అవుతానని ఆయన అన్నారట.మొత్తానికి సైరా చిత్రంతో పీరియాడికల్ చిత్రాలకు చిరు ఫుల్‌స్టాప్ పెట్టేశారని కొందరు ఇండస్ట్రీలో అనుకుంటున్నారు.

తాజా వార్తలు

Chiranjeevi No To Periodic Movies Related Telugu News,Photos/Pics,Images..