సరిలేరు నీకెవ్వరు.. మెప్పించలేదట!  

Chiranjeevi No Response To Mahesh Babu On Sarileru Neekevvaru-mahesh Babu,sarileru Neekevvaru,telugu Movie Gossips,telugu Movie News,vijayashanti

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు రిలీజ్ అయ్యి మంచి టాక్‌ను తెచ్చుకుంది.రిలీజ్ అయిన అన్ని చోట్లా ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో సినిమా భారీ సక్సెస్ దిశగా దూసుకెళ్తోంది.

Chiranjeevi No Response To Mahesh Babu On Sarileru Neekevvaru-mahesh Babu,sarileru Neekevvaru,telugu Movie Gossips,telugu Movie News,vijayashanti-Telugu Gossips-Chiranjeevi No Response To Mahesh Babu On Sarileru Neekevvaru-Mahesh Sarileru Neekevvaru Telugu Movie Gossips News Vijayashanti

ఈ సినిమాపై అటు ఇండస్ట్రీ జనంతో పాటు ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.అయితే ఒక్క వ్యక్తికి మాత్రం ఈ సినిమా నచ్చలేదని టాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా సక్సెస్ కావాలని, మహేష్‌ మరో బ్లాక్‌బస్టర్ కొట్టాలని కోరారు.అయితే సినిమా రిలీజ్ అయిన తరువాత చిరు ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తానంటూ మహేష్ ఆ సందర్భంగా చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.

కాగా తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాను చిరంజీవి వీక్షించినట్లు తెలుస్తోంది.కానీ ఆయనకు సినిమా పెద్దగా నచ్చలేదనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

దీంతో ఈ సినిమాపై చిరు స్పందించలేదని, మహేష్‌కు ఫోన్ చేస్తానన్న చిరు అందుకే ఫోన్ కూడా చేయలేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి.తనకు ఎవరు విషెస్ చెప్పినా సోషల్ మీడియాలో పంచుకునే మహేష్, చిరు గురించి ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదనేది మీడియా ప్రశ్న.

ఏదేమైనా సరిలేరు నీకెవ్వరు సినిమాపై చిరు ఏమన్నారో తెలియాలంటే మహేష్ రెస్పాండ్ కావాల్సిందే.

తాజా వార్తలు

Chiranjeevi No Response To Mahesh Babu On Sarileru Neekevvaru-mahesh Babu,sarileru Neekevvaru,telugu Movie Gossips,telugu Movie News,vijayashanti Related....