ఆ కుర్ర డైరెక్టర్‌కు మెగా ఛాన్స్.. సాహో అనాల్సిందేనట!  

Chiranjeevi Next Movie With Sujeeth - Telugu Chiranjeevi, Chiru153, Lucifer, Ram Charan, Sujeeth

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు రెండు విభిన్న పాత్రల్లో నటిస్తాడని తెలుస్తోంది.

 Chiranjeevi Next Movie With Sujeeth

కాగా ఈ సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా కొరటాల తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌లో కనిపిస్తాడని ఇప్పటికే లీకైన ఫోటోలు చూస్తే తెలుస్తోంది.

ఆ కుర్ర డైరెక్టర్‌కు మెగా ఛాన్స్.. సాహో అనాల్సిందేనట-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ఈ సినిమా తరువాత చిరు ఓ మలయాళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తాడని తెలుస్తోంది.మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న లూసిఫర్ చిత్ర తెలుగు రీమేక్ హక్కులను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో చిరు నటిస్తుండగా ఈ సినిమాను తెరకెక్కించే బాధ్యత సాహో చిత్ర దర్శకుడు సుజీత్‌కు అప్పగించారు.

సుజీత్ తెరెకెక్కించిన చిత్రాలను తాను చూశానని, అతడి ట్యాలెంట్ తనను ఇంప్రెస్ చేయడంతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు సుజీత్‌ను ఎంపిక చేసినట్లు మెగాస్టార్ తెలిపాడు.

ఇక లూసిఫర్ చిత్ర రీమేక్ కోసం అదిరిపోయే స్క్రిప్టును రాయాల్సిందిగా చిరు స్వయంగా సుజీత్‌ను కోరడం విశేషం.ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అతి త్వరలో రానున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు