చిరంజీవి ఎర్ర కండువా! కొత్త సినిమా న్యూ లుక్

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో హీరోయిన్ గా ఇప్పటికే స్టార్ హీరోయిన్ త్రిష ని ఫైనల్ చేశారు.

 Chiranjeevi New Movie Looks Leaked-TeluguStop.com

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొదలైనట్లు తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో చిరంజీవి ఎలాంటి లుక్ లో కనిపిస్తాడు అనేది మెగా ఫాన్స్ అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబందించిన కొన్ని లుక్స్ లీక్ అయ్యాయి.పెద్ద హీరోల సినిమాలకి వెళ్ళే జూనియర్ ఆర్టిస్ట్ ల వలనో, ప్రేక్షకుల వలనో సినిమాకి సంబందించిన కొన్ని ఫోటోలు బయటకి వస్తున్నా సంగతి తెలిసిందే.

ఈ నేపధ్యంలో చిరంజీవి లుక్ కూడా బయటకి వచ్చి ఒక్కసారి వైరల్ గా మారింది.

దేవాదాయ శాఖలో భూ ఆక్రమణలపై ఈ సినిమా కథ ఉండబోతుంది అని తెలుస్తుంది.

అయితే చిరంజీవికి సంబంధించి విడుదలైన లుక్స్ లో మెగాస్టార్ ఎర్ర కండువా వేసుకొని ఒకప్పటి ముఠామేస్త్రీ, ముగ్గురు మొనగాళ్ళులో పెద్ద చిరంజీవి తరహాలో ఉన్నాడు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఎర్ర కండువా సింబాలిక్ గా మారింది.

ఈ నేపధ్యంలో చిరంజీవి పాత్ర ఎర్ర కండువా వేసుకొని ఉండటంతో ఈ పిక్స్ కాస్తా వైరల్ అయ్యాయి.ఈ లుక్ బట్టి ఇందులో చిరంజీవి చేసే పాత్ర కార్మిక నాయకుడుగా ఉండబోతుందని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube