యంగ్ డైరెక్టర్‌తో చిరు సినిమా.. నవ్వులే నవ్వులు!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు చిరు రెడీ అవుతున్నాడు.

 Chiranjeevi Movie With Anil Ravipudi, Chiranjeevi, Anil Ravipudi, Acharya, Korat-TeluguStop.com

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఇక ఈ సినిమా పూర్తిగాక ముందే చిరు తన నెక్ట్స్ చిత్రాలను లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ క్రమంలో ఇప్పటికే కొందరు డైరెక్టర్లకు ఆయన సినిమా చేసే ఛాన్స్ ఇచ్చారు.వారిలో మెహర్ రమేష్, బాబీ, హరీష్ శంకర్ లాంటి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా చిరుతో ఓ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.గతంలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్2 చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు వంటి ఎంటర్‌టైనర్ మూవీని తెరకెక్కించి మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ డైరెక్టర్.ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ప్లాన్ చేస్తుండటంతో ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

కామెడీని తనదైన శైలిలో పండించి ప్రేక్షకులను నవ్వించడంలో చిరు ఆరితేరి ఉన్నారు.గతంలో చంటబ్బాయి లాంటి ఫుల్ లెంగ్త్ కామెడీ చిత్రంతో చిరు ఎలాంటి విజయాన్ని అందుకున్నాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

మరి అనిల్ రావిపూడి రాసుకున్న కామెడీ కథ చిరుకు ఎంతవరకు నచ్చుతుందనేది ఆసక్తికరంగా మారింది.ఒకవేళ నిజంగానే చిరుకు ఈ కథ నచ్చితే అనిల్‌తో సినిమా చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఇక ఈ కాంబోలో సినిమా వస్తే చూడాలని, అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube