చిరు మిస్ అయ్యాడు.. వెంకీ బ్లాక్ బస్టర్ కొట్టాడు.. ఈ సినిమా వెనుక పెద్ద కథ ఉందట..

ఈ సినీ ప్రపంచంలో ఎన్నో వింతలు మరెన్నో విశేషాలు జరుగుతాయి.అయి ఒకానొక సందర్భంలో బయట పడితే అందరు షాక్ అవ్వడం ఖాయం.

 Chiranjeevi Missed Venkatesh Hit The Blockbuster,  Chiranjeevi, Venkatesh, Konda-TeluguStop.com

ప్రతీ సినిమా పట్టాలెక్కాలంటే దాని వెనుక చాలా ఆలోచనలు, ఆచరణలు ఉంటాయి.ఇంత పెద్ద కథ జరిగితే కానీ ఒక సినిమా పట్టాలెక్కదు.

ఇలా ఒక్కోసారి ఒక హీరోతో అనుకున్న సినిమా మరో హీరో చేస్తూ ఉంటాడు.

ఇలాంటి సందర్భాలు చాలానే జరుగుతూ ఉంటాయి.

ఇలా జరిగితే దర్శక నిర్మాతలకు, హీరోలకు మధ్య గ్యాప్ వస్తుంది.టాలీవుడ్ లో నిర్మాతగా, ఎగ్జిగ్యూటర్ గా డిస్టిబ్యూటర్ గా రాణిస్తున్న కేవీబీ సత్యనారాయణ విక్టరీ వెంకటేష్ తో ఒకే ఏడాదికి రెండు సినిమాలు నిర్మించారు.

అవి కొండపల్లి రాజా ఒకటి.సుందరకాండ ఒకటి.

ఈ రెండు సినిమాలలో కొండపల్లి రాజాకు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు.అలాగే సుందరకాండ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు.

కేవీబీ సత్యనారాయణ రజనీకాంత్ నటించిన అన్నామలై సినిమా రైట్స్ తీసుకుని హైదరాబాద్ వస్తున్న క్రమంలోనే ఫ్లైట్ లో చిరు కలవడంతో ఆయనకు కథ వినిపించగా చిరు ఓకే చెప్పారట.అయితే ఆ ఆనందంలో కేవీబీ సత్యనారాయణ సుందరకాండ సెట్స్ కు వచ్చి అక్కడి వారికీ విషయం చెప్పగా ఆ సినిమా కూడా మనమే చేద్దామని వెంకీ అన్నారట.

దీంతో ఈయనకు ఏం చేయాలో అర్ధం కాలేదట.చిరును వదులుకున్నందుకు బాధపడాలో.లేదంటే వెంకీ మరో సినిమా ఓకే చేసాడని ఆనంద పడాలో తెలియని స్థితిలోకి వెళ్లారట.

Telugu Chiranjeevi, Hyderabad, Kondapalli Raja, Sundarakanda, Venkatesh-Movie

ఈ విషయాన్నీ చిరు కి చెప్పి వెంకీ తోనే కొండపల్లి రాజా తీశారు.ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.అయితే ఇక్కడ మరో విషయం కూడా జరిగింది.

ఈ సినిమా 1987లో హిందీలో ఉదాగస్ అనే నవల ఆధారంగా తీశారు.ఈ సినిమా రీమేక్ రైట్స్ కృష్ణం రాజు తెలుగులో ప్రాణస్నేహితులు సినిమా బేస్ చేసుకుని రజనీ తమిళ్ లో చేసారు.

మళ్ళీ అదే సినిమా అటు తిరిగి ఇటు తిరిగి కొండపల్లి రాజా గా తెలుగులో రావడంతో కృష్ణం రాజు కేసు వేశారు.చివరకు పెద్దలు జోక్యం చేసుకుని రాజీ కుదర్చగా ఈ విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube