'మెగా 156' ఆగిపోయిందా.. క్లారిటీ ఇదే!

టాలీవుడ్ లెజెండరీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi )వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతూ దూసుకెళ్తున్నారు.సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఈయన కుర్ర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా వరుసగా డైరెక్టర్లకు కమిట్మెంట్స్ ఇస్తూ వాటిని ఒకదాని తర్వాత మరొక పూర్తి చేస్తూ పోతున్నాడు.

 Chiranjeevi Mega 156 Update, Mega157, Megastar Chiranjeevi, Director Mallidi-TeluguStop.com

ఇక ఈ మధ్యనే భోళా శంకర్ సినిమా( Bhola Shankar )తో వచ్చి ప్లాప్ అందుకున్నాడు.

ఇది రీమేక్ సినిమా కావడంతో ముందు నుండి అంచనాలు భారీగా లేకపోవడంతో ప్లాప్ అయ్యింది.మెగాస్టార్ కెరీర్ లోనే అట్టర్ ప్లాప్ గా నిలిచి పోవడంతో ఇప్పుడు ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు.మొన్న మెగాస్టార్ బర్త్ డే కానుకగా ప్రకటించిన రెండు సినిమాలు కూడా స్ట్రైట్ సినిమాలే కావడంతో ఇప్పుడు మెగాస్టార్ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.

మరి మెగాస్టార్ ఇటీవలే ప్రకటించిన సినిమాల్లో మెగా 156 ( Mega157 )ఒకటి.ఈ ప్రాజెక్ట్ ను మెగాస్టార్ కూతురు తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించనున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు.

అయితే డైరెక్టర్ ను ఇంకా ప్రకటించక పోయిన కూడా కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేయబోతున్నాడు అని తెలుస్తుంది.ఇదిలా ఉండగా గత కొద్దీ గంటలుగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

కానీ తాజాగా ఈ విషయంలో క్లారిటీ తెలుస్తుంది.ఈ మూవీ ఆగిపోలేదని ప్రజెంట్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ( Kalyan Krishna ) కథ, స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నారని మరి ఇది పూర్తి అయ్యాక అధికారికంగా వివరాలు వెల్లడించనున్నారని తెలుస్తుంది.ఇక దీంతో పాటు మెగా157 కూడా స్టార్ట్ కాబోతుంది.యువ డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి( Mallidi Vassishta ) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా సినిమాను యువీ క్రియేషన్స్ వారు నిర్మించబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube