పవర్‌ఫుల్ టైటిల్‌తో బరిలోకి దిగుతున్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Chiranjeevi Lucifer Remake Title Byreddy, Chiranjeevi, Lucifer, Remake, Byreddy,-TeluguStop.com

ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే చిరు, తన నెక్ట్స్ చిత్రాలను లైన్‌లో పెట్టాలని చూస్తున్నాడు.ఈ క్రమంలోనే మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు చిరు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమా డైరెక్షన్ బాధ్యత యంగ్ డైరెక్టర్ సుజీత్, అటుపై వివి వినాయక్ నుండి చివరకు తమిళ దర్శకుడు మోహన రాజా చేతుల్లోకి వచ్చి పడింది.

అయితే ఈ సినిమాలో చిరు చాలా పవర్‌ఫుల్ పాత్రలో నటించనున్నాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

ఈ క్రమంలో ఈ సినిమా కోసం ఓ పవర్‌ఫుల్ టైటిల్‌ను పెట్టాలని మెగాస్టార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.దీంతో ఈ సినిమాకు ‘బైరెడ్డి’ అనే టైటిల్‌ను పెట్టాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట.

పూర్తి పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘బైరెడ్డి’ అనే టైటిల్ పర్ఫెక్ట్ యాప్ట్ అవుతుందని వారు భావిస్తున్నారట.అయితే ఈ టైటిల్ తెలుగు ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ సినిమాలో చిరు గెటప్ కూడా ఈ టైటిల్‌కు పూర్తి న్యాయం చేస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా తనకు బాగా నచ్చడంతో ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సొంతం చేసుకున్నాడు.ఇక తన తండ్రి మెగాస్టార్ అయితేనే ఈ సినిమాకు పూర్తి న్యాయం చేయగలడని చరణ్ భావిస్తున్నాడు.2021 ద్వితీయార్థంలో ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు చరణ్ అండ్ టీమ్ రెడీ అవుతోంది.మరి బైరెడ్డి టైటిల్ ఈ సినిమాకు ఎంతవరకు సెట్ అవుతుందో తెలియాలంటే మాత్రం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ విమర్శకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube