చిరు బర్త్‌ డే స్పెషల్‌ : మెగా లూసీఫర్‌ టైటిల్‌ అఫిషియల్ అనౌన్స్‌మెంట్‌

మెగా స్టార్ చిరంజీవి మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ లూసీఫర్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాలున్న ఈ రీమేక్ కు తమిళ దర్శకుడు మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే.

 Chiranjeevi Lucifer Remake Tatil Godfather ,  Chirenjeevi, Godfather , Lucifer-TeluguStop.com

ఈ సినిమా రీమేక్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.సినిమా షూటింగ్‌ ఇటీవలే మొదలు అయ్యింది.

రేపు చిరంజీవి బర్త్‌ డే సందర్బంగా సినిమా ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.లూసీపర్‌ రీమేక్ కు సంబంధించినంత వరకు అంతా కూడా చాలా ఊహించుకున్నారు.

సినిమా టైటిల్ మొదటి నుండి కూడా గాడ్‌ ఫాదర్‌ అనే అనుకున్నారు.అన్నట్లుగానే చిరంజీవి కి సరిగ్గా సూట్‌ అయ్యేలా గాడ్‌ ఫాదర్‌ ను ఖరారు చేయడం జరిగింది.

సినిమా టైటిల్ ను ఖరారు చేసిన చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమా ఫస్ట్‌ లుక్‌ ను మాత్రం రివీల్‌ చేయలేదు.రేపు చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా ఏమైనా విడుదల చేస్తారేమో చూడాలి.చిరంజీవి బర్త్‌ డే సందర్బంగా విడుదల అయిన సినిమా అన్నింటికి కంటే ఇది ది బెస్ట్‌ కానుక అంటూ అంతా కూడా కామెంట్స్ చేస్తున్నారు.సినిమా ఫస్ట్‌ లుక్‌ రాకున్నా కూడా చిరంజీవి అభిమానులు మాత్రం గాడ్ ఫాదర్‌ పోస్టర్‌ కు ఫిదా అవుతున్నారు.

ఈ సినిమా ను రామ్‌ చరణ్ నిర్మాణ సంస్థ అయిన కొనిదెల వారు సమర్పిస్తూ ఉండగా ఎన్వీ ప్రసాద్‌ మరియు ఆర్బీ చౌదరి నిర్మిస్తున్నారు.ప్రస్తుతం సినిమా కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

 లూసీఫర్ లో చిరంజీవికి సోదరి పాత్రలో నయనతార నటిస్తున్న విషయం తెల్సిందే.ఇక సత్యదేవ్‌ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది.

ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు విడుదల చేస్తారని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube