మెగా స్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ రీమేక్ లూసీఫర్ ను ఎప్పుడెప్పుడు మొదలు పెడతాడా అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.ఎట్టకేలకు మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ మొదలు అయ్యింది.
కాస్త ఆలస్యం అయినా కూడా షూటింగ్ ను చాలా స్పీడ్ గా పూర్తి చేయబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు ప్రకటించారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం లూసీఫర్ రీమేక్ ను చిరంజీవి రారాజు అనే టైటిల్ తో చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఆ విషయంలో గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి.కొందరు మాత్రం లూసీఫర్ అనే టైటిల్ నే ఉంచవచ్చు కదా అంటున్నారు.
మలయాళి పదం అన్నట్లుగా కాకుండా సింపుల్ గా అందరికి అర్థం అయ్యేలా బాగుంది.లూసీఫర్ అనే సినిమా కు రీమేక్ కూడా లూసీఫర్ అయితే బాగుంటుంది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ ప్రారంభం అయ్యింది.ఈ నెలలో చిరంజీవి బర్త్ డే ఉంది.కనుక చిరు బర్త్ డే కు సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయాలి కనుక లూసీఫర్ మరియు రారాజు నుండి ఒక టైటిల్ ను అనౌన్స్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.బర్త్ డే రోజున లూసీఫర్ రీమేక్ టైటిల్ విషయంలో ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను మలయాళంలో దక్కించుకున్న లూసీఫర్ ఇక్కడ కూడా మెగా ఇమేజ్ తోడు అవ్వడం వల్ల ఖచ్చితంగా వంద కోట్లకు మించిన వసూళ్లను దక్కించుకోవడం ఖాయం అంటూ అభిమానులు అంటున్నారు.

తెలుగు లో లూసీఫర్ రీమేక్ కు హీరోయిన్ పాత్రను అదనంగా జోడించబోతున్నారు.నయనతార హీరోయిన్ గా ఈ సినిమాలో నటిస్తుందని.సీనియర్ హీరోయిన్ ఒకరు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది.
ఈ సినిమాను కేవలం మూడు నెలల్లోనే ముగించేలా ప్లాన్ చేశారు.ఆ వెంటనే వేదాళం ను మొదలు పెట్టే అవకాశం ఉంది.