లూసీఫర్‌ కోసం మరో దర్శకుడు కావాల్సిందేనా?

మెగాస్టార్‌ చిరంజీవి మలయాళం మూవీ ‘లూసీఫర్‌’ ను రీమేక్‌ చేయాలని బలంగా కోరుకున్నాడు.కాని అది సాధ్యం అయ్యే అవకాశం కనిపించడం లేదు.

 Chiranjeevi Lucifer Movie Director May Be Change , Bellamkonda Chatrapathy, Chir-TeluguStop.com

మొదట ఈరీమేక్‌ కోసం సుజీత్‌ను అనుకున్నారు.ఆయన మూడు నాలుగు నెలల పాటు కథ రెడీ చేసి చివరకు మెప్పించలేక ప్రాజెక్ట్‌ ను వదిలేశాడు.

ఆ తర్వాత లూసీఫర్‌ రీమేక్‌ బాధ్యతలు చిరంజీవికి సన్నిహితుడు అయిన వివి వినాయక్‌ చేతిలోకి వెళ్లాయి.ప్రముఖ రచయితలు మరియు దర్శకులతో కలిసి లూసీఫర్‌ రీమేక్‌ స్క్రిప్ట్‌ వర్క్‌ చేశాడు.

మూడు నాలుగు నెలల పాటు కథ రెడీ చేసినా కూడా వినాయక్‌ మెప్పించడంలో విఫలం అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి.ఈ సమయంలోనే వినాయక్‌ తన బాలీవుడ్‌ ఎంట్రీ గురించి అధికారికంగా ప్రకటన చేశాడు.

బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చేందుకు వినాయక్‌ సిద్దం అయ్యాడు.బెల్లంకొండ శ్రీనివాస్‌ ను చత్రపతి సినిమాతో హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లే బాధ్యతను దర్శకుడు వినాయక్‌ భుజాలపైకి ఎత్తుకున్నాడు.

ఆయన సినిమా కోసం ఇప్పటికే పని మొదలు పెట్టాడు.వచ్చే ఏడాది ఆరంభంలో హిందీ చత్రపతి మొదలు అవుతుందనే ప్రచారం జరుగుతోంది.వచ్చే ఏడాది మొత్తం కూడా ఆ రీమేక్‌ పనిలో వినాయక్‌ ఉంటాడు.కనుక లూసీఫర్‌ రీమేక్‌ ను ఆయన చేస్తాడా లేదా అనే అనుమానాలకు తెర పడ్డట్లయ్యింది.

లూసీఫర్‌ రీమేక్‌ నుండి ఆయన తప్పుకున్నాడని ఆ స్థానంలో మరో దర్శకుడు రావాల్సిందే అంటూ తెలుస్తోంది.త్వరలోనే లూసీఫర్‌ తెలుగు రీమేక్‌ కు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది.

ఆ సమయంలో దర్శకుడు ఎవరు అనే విషయంలో క్లారిటీ ఇస్తారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న ఆచార్య తర్వాత మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో వేదాళంను చేయబోతున్న విషయం తెల్సిందే.

ఆ తర్వాత లూసీఫర్‌ ఉంటుందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube