వినాయక్‌ చేతిలో పడ్డాక అవి ఉండకుండా ఉంటాయా..!  

chiranjeevi lucifer movie remake with commercial elements Chiranjeevi, Lucifar, VV Vinayak, Sahoo, Sujith, Tagoore, Khaidhi Number 150, Vedhalam, - Telugu Chiranjeevi, Chiranjeevi Lucifer Movie Remake With Commercial Elements, Khaidhi Number 150, Lucifar, Sahoo, Sujith, Tagoore, Vedhalam, Vv Vinayak

మెగాస్టార్‌ కు బాగా నచ్చిన మలయాళ మూవీ లూసీఫర్‌.మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ చేసిన లూసీఫర్‌ను తెలుగులో తాను చేస్తాను అంటూ గత ఏడాదే ఫిక్స్‌ అయ్యాడు.

TeluguStop.com - Chiranjeevi Lucifar Vv Vinayak

ఆ సినిమా రీమేక్‌ బాధ్యతలను సాహో దర్శకుడు సుజీత్‌కు అప్పగించారు.దాదాపుగా నాలుగు అయిదు నెలల పాటు సుజీత్‌ రీమేక్‌ స్క్రిప్ట్‌ పై వర్క్‌ చేశాడు.

చివరకు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ యాడ్‌ చేయడంలో విఫలం అయ్యాడు అంటూ సుజీత్‌ను లూసీఫర్‌ రీమేక్‌ బాధ్యతల నుండి తప్పించడంతో పాటు సినిమాను కాస్త ఆలస్యంగా మొదలు పెట్టాలనుకున్నారు.ఆచార్య తర్వాత లూసీఫర్‌ అనుకున్నారు.

TeluguStop.com - వినాయక్‌ చేతిలో పడ్డాక అవి ఉండకుండా ఉంటాయా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కాని అంతకు ముందు వేదాళం రీమేక్‌ను చేయాలని నిర్ణయించుకున్నాడు మెగాస్టార్‌.వేదాళం పూర్తి అయ్యేలోపు వివి వినాయక్‌ కు లూసీఫర్‌ రీమేక్‌ బాధ్యతలు అప్పగించి కథను సిద్దం చేయాల్సిందిగా చిరంజీవి సూచించారు.

వివి వినాయక్‌ అంటేనే మాస్‌ మసాలా ఎలిమెంట్స్‌ కమర్షియల్‌ మేళ్లవింపులు ఉంటాయి.అయితే లూసీఫర్‌లో మాత్రం పాటలు ఉండవు, కామెడీ ఉండదు ఇంకా ఎలాంటి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉండవు.

కనుక వినాయక్‌ పూర్తిగా మార్చేస్తున్నాడు.కథ మూలంను తీసుకుని దానికి పాటలు, హీరోయిన్ కామెడీ యాక్షన్‌ లవ్‌ డ్రామా ఇలా అన్నింటిని కలిపి స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నాడు.

వచ్చే ఏడాది సమ్మర్‌ నుండి లూసీఫర్‌ కొత్త స్క్రిప్ట్‌ తో సినిమా మొదలు అయ్యే అవకాశం ఉంది.లూసీఫర్‌ మొత్తం మార్చి మెగాస్టార్‌ ఇమేజ్‌కు తగ్గట్లుగా తెరకెక్కించబోతున్నారు.గతంలో చిరంజీవి వినాయక్‌ల కాంబోలో వచ్చిన ఠాగూర్‌, ఖైదీ నెం.150 సినిమాలు తమిళ సినిమాలకు రీమేక్‌.ఆ రెండు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.కనుక లూసీఫర్‌ విషయంలో మెగా ఫ్యాన్స్‌ చాలా నమ్మకంతో ఉన్నారు.ఆచార్య సినిమా త్వరలో పూర్తి చేసి వేదాళం సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు పూర్తి చేసి ఆ వెంటనే లూసీఫర్‌ ను మొదలు పెట్టబోతున్నాడు.ఈ మూడు సినిమాలు కూడా 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

#Sahoo #VV Vinayak #Vedhalam #Chiranjeevi #Sujith

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chiranjeevi Lucifar Vv Vinayak Related Telugu News,Photos/Pics,Images..