టాలీవుడ్ ఇండస్ట్రీలోకి బాల నటుడుగా అడుగుపెట్టి అనంతరం హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ).ఒకరు.
ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా( RRR movie ) ద్వారా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో ఎంతో లీనమైపోయినటువంటి ఫిదా అయ్యారు.
ఇలాంటి పాత్రలు చేయడం కేవలం ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యమంటూ ఈయన నటనపై ఎంతోమంది సినీ సెలబ్రిటీలు సీనియర్ నటులు ప్రశంసల కురిపించారు.

ఇలా కొమరం భీం పాత్ర ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో చేస్తున్నారు.ఈ సినిమాకు దేవర ( Devara ) అనే టైటిల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.
ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్నటువంటి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.అయితే రాజమౌళి సినిమాల్లో చేసిన తర్వాత మరో సినిమా చేస్తే ఫ్లాప్ అని సెంటిమెంట్ మాత్రమే అభిమానులను వెంటాడుతుంది కానీ ఈ సినిమా విడుదల చేసినటువంటి పోస్టర్స్ చూస్తే కనుక సినిమా మరో లెవెల్ లో ఉంటుంది అనడంలో సందేహం లేదు.

మరోవైపు కొరటాల శివ ఆచార్య సినిమాకు దర్శకత్వం వహించి మొత్తానికి డిజాస్టర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు.అయితే తన ప్రమేయం లేకపోయినా ఈ సినిమా విషయంలో తాను డిజాస్టర్ డైరెక్టర్ గా నిలిచిపోవాల్సి వచ్చిందన్న కలిసి కొరటాలలో భారీగా కనిపిస్తుంది.దేవర సినిమాతో ఎలాగైనా తనపై పడినటువంటి ఆ మార్కు తొలగించుకోవాలని ఈయన కూడా అంతే కసిగా ఈ సినిమాని షూట్ చేస్తున్నారని తెలుస్తుంది.ఇలా ఒకవైపు ఎన్టీఆర్ మరొకవైపు కొరటాల శివ ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాని ముందుకు నడిపిస్తున్నారు.
ఇక వ్యక్తిగతంగా ఎన్టీఆర్ మనసు కూడా ఎంత మంచిదో మనకు తెలిసిందే.ఎవరికి హాని చేసే వ్యక్తి ఎన్టీఆర్ కాదు అలాంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవికి తీవ్రమైనటువంటి అన్యాయం చేశారని తెలుస్తుంది.

చీమకు కూడా హాని చేయనటువంటి ఎన్టీఆర్ చిరంజీవికి ( Chiranjeevi )ఎందుకు అన్యాయం చేస్తారు.అసలు ఏ విషయంలో అన్యాయం చేశారు అనే విషయానికి వస్తే.రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి మొట్టమొదటి చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్( Student No 1 ) అప్పటికి రాజమౌళి ( Rajamouli ) కొత్త దర్శకుడు కావడంతో ఈయన సినిమాలపై ఎవరికి పెద్దగా అంచనాలు కూడా ఉండేవి కాదు.ఇక ఈ సినిమా విడుదల సమయంలోనే చిరంజీవి నటించిన డాడీ( Daddy )సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే ఎవరు ఊహించని విధంగా రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకున్నారు.ఈ సినిమా దెబ్బకు చిరంజీవి డాడీ సినిమా సైడ్ అయింది.
డాడీ సినిమాని ఇప్పటికి చూసిన చాలా ఎమోషనల్ గా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.ఇలాంటి సినిమా ఎన్టీఆర్ దెబ్బకు ఫ్లాప్ గా నిలిచింది అంటే ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా చిరంజీవి డాడీ సినిమాకు అన్యాయం చేశారని అభిమానులు భావిస్తుంటారు.