మరొక రికార్డ్ క్రియేట్ చేసిన మెగాస్టార్ ఫస్ట్ సింగల్ !

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఆచార్య.మెగాస్టార్ కెరీర్ లో ఇది 152 వ సినిమా.

 Chiranjeevi Lahe Lahe Song Touch 60 Million Mark In Youtube, Chiranjeevi, Lahe L-TeluguStop.com

కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కి స్తున్నాడు.ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఆయన ‘సిద్ద’ అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు.

ఇందులో రామ్ చరణ్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది.

వీరిద్దరి పాత్రలు సినిమాకే హైలెట్ గా నిలవ బోతున్నాయని తెలుస్తుంది.

చరణ్ పాత్ర సెకండ్ హాఫ్ లో ఎక్కువగా కనిపించనుందని టాక్.అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

ఇప్పుడిప్పుడే కరోనా తగ్గి మాములు పరిస్థితులు నెలకొనడంతో జులై మొదటి వారంలో షూట్ ప్రారంభం చేయడానికి కొరటాల శివ సన్నాహాలు చేస్తున్నాడు.

ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలొకొన్నాయి.ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, పాటలు బాగా ఆకట్టుకుంటున్నాయి.మణిశర్మ అందించిన సంగీతం కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచేలా చేసాయి.

అలా ఈ సినిమా నుండి విడుదల ఐన లాహే లాహే పాట కూడా సూపర్ హిట్ అందుకుంది.ఆ సాంగ్ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఎప్పుడో 50 మిలియన్ మార్క్ ను టచ్ చేసింది.

అయితే ఇప్పుడు మరొక రికార్డ్ క్రియేట్ చేసింది.

లాహే లాహే సాంగ్ యూట్యూబ్ లో 60 మిలియన్ మార్క్ ను టచ్ చేసింది.ఇప్పుడు ఈ సాంగ్ విడుదల అయ్యి సూపర్ అవ్వడంతో చరణ్, పూజ మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఆ సాంగ్ మరి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని టాక్.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాను కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ పతాకం పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube