మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ సైరా నరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.చిరు అత్యంత ప్రెస్టీజియస్ మూవీగా నటించిన సైరా కలెక్షన్ల పరంగానూ తన సత్తా చాటుకుంది.
ఇక ఈ సినిమా తరువాత మెగాస్టార్ తన నెక్ట్స్ మూవీని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించనున్నాడు.ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
అయితే ఈ సినిమాతో చిరు ఫ్యాన్స్ ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న కలను తీర్చేందుకు కొరటాల ప్లాన్ చేశాడు.ఈ సినిమాలో చిరుతో అదిరిపోయే స్టెప్స్ వేయించేందుకు కొరటాల రెడీ అయ్యాడు.
దీనికి సంబంధించి ఈ సినిమా ఓపెనింగ్‌లోనే చిరుతో ఓ అదిరిపోయే డ్యాన్స్ నెంబర్‌ను తెరకెక్కించేందుకు డైరెక్టర్ సిద్ధమయ్యాడు.
డ్యాన్స్ అంటేనే చిరు అని మెగాస్టార్ అభిమానులు అనుకుంటున్నారు.
ఇప్పుడు మరోసారి చిరుతో అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు వేయించి మెగా గిఫ్ట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన స్టార్ హీరోయిన్ త్రిష నటించనున్నట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూ్స్ చేయనున్నారు.డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.