ఇంగ్లీష్ వెర్షన్‌ లో డబ్‌ అయిన చిరంజీవి మూవీ ఏదో తెలుసా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ జోనర్ ఆ జోనర్ అనే తేడాలు లేకుండా అన్ని జోనర్ల సినిమాలలో చిరంజీవి నటించారు.

 Chiranjeevi Kodama Simham Movie Dubbed English Version Hunter Indian Treasure-TeluguStop.com

ప్రస్తుతం చిరంజీవి 152వ సినిమాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు.ప్రాణం ఖరీదు సినిమాతో 42 సంవత్సరాల క్రితం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తన సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను, ఇండస్ట్రీ హిట్లను సొంతం చేసుకున్నారు.

వయస్సు ఆరు పదులు దాటినా కుర్ర హీరోలకు సమానంగా డ్యాన్సులు, ఫైట్లు చేస్తూ తనకున్న క్రేజ్ తో సునాయాసంగా భారీ కలెక్షన్లను సాధిస్తున్నారు.అయితే చిరంజీవి నటించిన కొన్ని సినిమాలు ఇతర దేశ భాషల్లోకి కూడా డబ్ కావడం గమనార్హం.

 Chiranjeevi Kodama Simham Movie Dubbed English Version Hunter Indian Treasure-ఇంగ్లీష్ వెర్షన్‌ లో డబ్‌ అయిన చిరంజీవి మూవీ ఏదో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొదమ సింహం మూవీలో చిరంజీవి కౌబాయ్ గా నటించి తన నటనతో మెప్పించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ లోకి డబ్ కావడం గమనార్హం.

సౌత్ ఇండియా సినిమాలలో ఇంగ్లీష్ వెర్షన్ లోకి డబ్ అయిన సినిమాగా కొదమ సింహం నిలిచింది.హంటర్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజర్ పేరుతో ఈ సినిమా ఇంగ్లీష్ లోకి డబ్ అయింది.

ఈ సినిమాతో పాటు చిరంజీవి నటించిన మరికొన్ని సినిమాలు సైతం ఇతర భాషల్లోకి డబ్ అయ్యాయి.చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం, స్వయంకృషి సినిమాలు రష్యన్ భాషలోకి డబ్ కావడం గమనార్హం.

Telugu Chiranjeevi, English Dubbed Movie, Hunter Indan Treasure, Kodama Simham-Movie

స్వయంకృషి సినిమా మాస్కో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో సైతం ప్రదర్శించడబడింది.ఈ విధంగా ఇతర హీరోలకు సాధ్యం కాని ఎన్నో రికార్డులను మెగాస్టార్ చిరంజీవి సొంతం చేసుకున్నారు.ఆచార్య తరువాత చిరంజీవి మూడు సినిమాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే సంగతి తెలిసిందే.

#Chiranjeevi #HunterIndan #Kodama Simham #EnglishDubbed

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు