చిరంజీవి ఎత్తుకి, బాలకృష్ణ పైఎత్తు వేసేనా ?     2016-12-27   02:11:07  IST  Raghu V

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ఖైదీనం.150, నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి రెండూ సంక్రాంతి బరిలో పోటిపడేందుకు సిద్ధమవుతున్నయి. నిన్న దర్శకుడు క్రిష్ ఇచ్చిన ప్రసంగంతో ఇరువర్గాల్లో పోటి వాతావరణం మరింత వేడెక్కిందని టాక్.

ఇదిలా ఉంటే, అవతలి వైపు విడుదల తేది తెలిస్తే, తమ చిత్రం యొక్క విడుదల తేదీని ప్రకటించాలని ఇరువర్గాలు ఎదురుచూస్తున్నాయి. సాధారణంగా విడుదల తేదిని ఆడియో ఫంక్షన్స్ లో ప్రకటిస్తారు. కాని ఖైదీనం 150 విడుదల తేది బయటకి రాకపోవడంతో గౌతమీపుత్ర శాతకర్ణి సరిగ్గా ఎప్పుడు వచ్చేది కన్ఫర్మ్ గా చెప్పలేదు.

ఇక ఖైదీ యూనిట్ అయితే, ఆడియో ఫంక్షన్ జరపకుండా, విడుదల తేది తెలుపకుండా బండి లాక్కొస్తోంది. ఏం చేద్దాం మరి .. అవతలి వారి కన్నా ఒక్కరోజైనా ముందు రావలని ఇద్దరి ప్లాన్.

అయితే, మాకు అందిన సమాచారం ప్రకారం జనవరి 11న తేదిన తన 150వ సినిమాని మెగాస్టార్ పోటిలోకి దింపుతున్నారని డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో టాక్. ఇక బాలకృష్ణ 12, 13, 14 ఏ తేదికి వచ్చినా, తన ఓపెనింగ్స్ కి అడ్డు ఉండదని చిరంజీవి ప్లాన్. మరి మన బాలయ్యబాబు కూడా చిరంజీవి ఎత్తుకు పైఎత్తు వేసి జనవరి 11వ తేదినే గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను దింపుతారా లేదా అనే విషయం ఇప్పుడు ఆసక్తికరం.